ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు…. సీఎం అరవింద్ కేజ్రీవాల్ , కోర్ట్ ముందు హాజరు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు లో, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ , రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టుకు వర్చువల్ గా హాజరు అయ్యారు. . లిక్కర్ పాలసీ కేసు లో గత సంవత్సరం ఏప్రిల్ లో సిబిఐ, కేజ్రీవాల్ ను 9 గంటలపాటు విచారించింది. ఇదే కేసులో ఇప్పటికే, దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నా రు. ED (Enforcement Directorate) కూడా ఈ అంశంలో కేసు నమోదు చేసింది, ఈ క్రమంలోనే, విచారణకు హాజరు కావాలని గత కొద్ది నెలలుగా ,ED , కేజ్రీవాల్ కు 5 సార్లు నోటీసు లు ఇచ్చినా , కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఆరవ సారి, ఈ నెల ఫిబ్రవరి 19 న హాజరు కావాలని ED నోటీసు లు ఇచ్చింది. కేజ్రీవాల్ విచారణకు సహకరించటం లేదని, ఈ నెల 7వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు (ED Officials) పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్ట్ , ఈ నెల 17న కోర్ట్ కు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.
అయితే, ఢిల్లీ అసెంబ్లీ లో తమ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం చర్చ జరగాల్సి ఉన్నందున, తాను ఈ సారి వ్యక్తిగతంగా హాజరు కాలేనని, virtual గా హాజరు అవుతానని, తదుపరి విచారణకు మాత్రం వ్యక్తిగతంగా హాజరు అవుతానని కేజ్రీవాల్ అభ్యర్ధించగా , కోర్ట్ అంగీకరించింది. ఆ క్రమంలో ఈ రోజు కేజ్రీవాల్ కోర్ట్ కు వర్చ్యువల్ గా హాజరు అయ్యారు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారం జరిగింది. తదుపరి విచారణను కోర్ట్ మార్చ్ 16 కు వాయిదా వేసింది, ఆరోజు మాత్రం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని కోర్ట్ ఆదేశించింది.