జగన్ కు ప్రతిపక్ష నేత హోదా వస్తుందా ?

 

 

 

 

 

 

 

 

 

అసెంబ్లీ మొద‌లైంది.  శాసనసభ సభ్యులుగా , టీడీపీ మంత్రుల ప్రమాణస్వీకారం  అయిపోయింది. వెనువెంటనే, తమ పార్టీ తోటి వైసీపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తికాకుండానే, కేవలం తన ప్రమాణస్వీకారం మాత్రమే పూర్తి చేసుకుని , హడావిడిగా బయటకు వెళ్ళిపోయి తరువాత రోజు స్పీకర్ ఎన్నిక పూర్తి కాగానే, అన్ని పార్టీ నేతలు, స్పీకర్ గా ఎన్నికయిన ఎమ్మెల్యేను, ఆయన కుర్చీ వున్న , పోడియం దగ్గరకు, గౌరవంగా తీసుకెళ్లే సంపద్రాయానికి గండిగొట్టి, అసెంబ్లీ కి డుమ్మా కొట్టిన జగన్, ఆ రోజు, పులివెందుల‌లో ప‌ర్య‌టించి, తరువాత బెంగుళూరు ప్యాలెస్ లో సేద తీరుతూఉండగా , అప్పుడు గుర్తుకొచ్చింది జ‌గ‌న్ కు… ప్ర‌తిప‌క్ష‌హోదా.  నాకు ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్ కు వుత్తరం రాసాడు. గ‌త ఎన్నిక‌ల్లో క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యం సాధించిన వైసీపీకి, 5 ఏళ్ల పాల‌న త‌ర్వాత జ‌నం ఛీకొట్టి 11 స్థానాల‌కు ప‌రిమితం చేశారు. కూట‌మికి ఏక‌ప‌క్షంగా విజ‌యాన్ని ఇచ్చారు. సాధార‌ణంగా మొత్తం సీట్ల‌లో కనీసం 10 వంతు స్థానాలు అంటే 18 స్థానాలు సాధించే పార్టీ కి ప్రతిపక్ష పార్టీ  హోదా లభిస్తుంది, వారి నాయ‌కుడికి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదా వ‌స్తుంది. స‌భ‌లో స‌భా నాయ‌కుడిగా ఉన్న సీఎం త‌ర్వాత ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి కూడా అంత‌టి గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి.

కానీ, ఈసారి వైసీపీకి ప‌దోవంతు కూడా రాలేదు కాబ‌ట్టి… ప్ర‌తిప‌క్ష హోదా రాలేదు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదా రాలేదు. ఆ విష‌యం వైసీపీకి కూడా తెలుసు కాబ‌ట్టే, చ‌డీచ‌ప్పుడు లేకుండా ప్ర‌మాణ‌స్వీకారం చేసి వెళ్లారు. కానీ, ఈరోజు త‌మ‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఉంటుంద‌ని స్పీక‌ర్ కు బ‌హిరంగ లేఖ రాయ‌టం రాజ‌కీయ వ‌ర్గాల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. జ‌గ‌న్ కు అభ్యంత‌రం ఉంటే ప్ర‌మాణ‌స్వీకారం చేసే రోజే సీఎం త‌ర్వాత త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరాల్సింది. కానీ కోర‌లేదు… తీరా బెంగుళూరు ప్యాలెస్ లో సేద తీరుతున్న స‌మ‌యంలో ఎందుకు గుర్తుకొచ్చింది అంటూ పెద‌వి విరుస్తున్నారు.

“నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, గతంలో, ఏ సందర్భాలలో, మొత్తం సీట్లలో, 10 శాతం రాకపోయినా, ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారో, అవన్నీ ఉటంకిస్తూ “, జగన్ స్పీకర్ కార్యాలయానికి లేఖ రాసాడు.

రాసిన లేఖలో కూడా, 1984 లో టీడీపీ కి పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా రాకపోయినా, అప్పటి టీడీపీ ఎంపీ పర్వతనేని ఉపేంద్రకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, జగన్ రాసాడు. ఇది ఎంత అసత్యమో అని టీడీపీ నేతలు ఘాటుగా రిప్లై ఇచ్చారు. 1984 లో టీడీపీ ఉపేంద్ర అసలు లోక్ సభ ఎంపీ కాదు, అప్పుడు రాజ్యసభ ఎంపీ. అప్పుడు టీడీపీ లోక్ సభ నేతగా సి.మాధవరెడ్డి అని ఆదిలాబాద్ నుండి గెలిచిన టీడీపీ ఎంపీ వున్నారు. అప్పుడు టీడీపీ పార్టీ కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అలాగే జగన్ రాసిన లెటర్ లో 1994 లో వుమ్మడి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా స్థాయిలో సీట్లు రాకుండా, కేవలం 25 మాత్రమే వచ్చాయి, అయినా అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే p.జనార్దన్ రెడ్డి కి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని రాసాడు. ఇది కూడా ఎంత అసత్యమో. అప్పుడు జనార్దన్ రెడ్డి కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. కేవలం కాంగ్రెస్ శాసనసభ పార్టీ అధినేతగా మాత్రమే గుర్తింపు ఇచ్చారు.

అసలు జగన్ ను ప్రతిపక్ష నేత గా గుర్తించే ముందు, వైసీపీ నుండి గెలిచిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశమై, జగన్ ను తమ పార్టీ శాసన సభ అధినేతగా ఎన్నుకుని, ఆ విషయం ఒక లేఖ రూపంలో స్పీకర్ ఇవ్వలేదు. అసలు అదే ఇవ్వకుండా , ప్రతిపక్ష నేత హోదా అడగటం హాస్యాస్పదం.

2019 లో టీడీపీ కి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి, 4 గురు టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ లోకి జంప్ అవగా, టీడీపీ కి 19 మాత్రమే మిగిలాయి. అప్పుడు శాసనసభలో జగన్ , చంద్రబాబు ను ఎద్దేవా చేస్తూ, “నీకున్న ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలను లాగేస్తే, నీకు ప్రతిపక్ష హోదా కూడా మిగలదు, నీ ప్రతిపక్ష హోదా , నా బిక్ష అని చంద్రబాబు ను హెచ్చరించాడు. అలంటి జగన్ కు ఇప్పుడు 175 లో కనీసం 10 శాతం సీట్లు రాకుండా, ప్రతిపక్ష నేత హోదా ఎలా అడుగుతున్నాడు ,సిగ్గు లేదా అని టీడీపీ వాళ్ళు జగన్ ను వేసుకుంటున్నారు.

దేవుడి స్క్రిప్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. ప్రజలు ఇచ్చిన అధికారంతో అహంకారంగా ప్రవర్తిస్తే..రిటర్న్ స్క్రిప్ట్ ఇంకెంత ఘోరంగా ఉంటుందో జగన్ కు ఇప్పుడైనా అర్థమవుతుందో లేదో

చట్టంలో లేకపోపోయినా.. పదిశాతం సభ్యులు లేని పార్టీని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటే… కేవలం స్పీకర్ చేతిలో మాత్రమే ఉంది. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో, కాంగ్రెస్ కు మొత్తం లోక్ సభ సీట్లలో, 10 శాతం సీట్లు రాలేదు కాబట్టి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు, అదే 2024 ఎన్నికల్లో, కాంగ్రెస్ కు ఒంటరిగానే 99 సీట్లు రావడంతో రాహుల్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. ఇది అంత జగన్ కు తెలియకనా? ఇది అంతా , కేవలం, “నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు”, కాబట్టే, శాసనసభ కు హాజరు కావటం లేదు, అనే నెపంతో శాసన సభ సమావేశాలు ఎగ్గొట్టే ప్లాన్ అని అనిపిస్తోంది.

1984 లో టీడీపీ ఉపేంద్ర అసలు లోక్ సభ ఎంపీ కాదు, అప్పుడు రాజ్యసభ ఎంపీ. అప్పుడు టీడీపీ లోక్ సభ నేతగా సి.మాధవరెడ్డి అని ఆదిలాబాద్ నుండి గెలిచిన టీడీపీ ఎంపీ వున్నారు. అప్పుడు టీడీపీ పార్టీ కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 1994 లో కూడా కాంగ్రెస్ p. జనార్ధన రెడ్డి కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు, కాంగ్రెస్ శాసన పక్ష నేత గా మాత్రమే హోదా ఇచ్చారు. 2014, 2019 లో పార్లమెంట్ లో లోక్ సభలో కాంగ్రెస్ కు 54 సీట్ల లోపే సీట్లు రావడం వల్ల ,కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు. 2014 లో కాంగ్రెస్ సుప్రీమ్ కోర్ట్ కు వెళ్లినా, పార్లమెంట్ వ్యవహారాల్లో కోర్ట్ కలుగజేసుకోదు, స్పీకర్, తన విచక్షణాధికారం ఉపయోగించవచ్చు అని చెప్పింది. ఇప్పుడు 2024 లో కాంగ్రెస్ కు 99 సీట్లు రావడం వల్ల , అంటే 542 లో 10 శాతం అంటే, 54 సీట్లు దాటి రావడం వల్ల, కాంగ్రెస్ కు ప్రతిపక్ష పార్టీ హోదా, రాహుల్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ, స్పీకర్, జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు. టీడీపీ వాళ్ళు, తమకు శాసనసభలో, జరిగిన అవమానాలు, అన్యాయాలు మర్చిపోకూడదు,జగన్ ట్రాప్ లో పడకూడదు. జగన్ ఆరాటం అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదా గురించి కాదు. ప్రతిపక్ష హోదా వస్తే, కాబినెట్ మంత్రి ప్రోటోకాల్ ఉంటుంది, పూర్తి సెక్యూరిటీ ఉంటుంది, అన్ని సదుపాయాలు వుంటాయని. నిజంగా ప్రతిపక్షంగా అసెంబ్లీ లో పోరాటం చేద్దామనే ఉద్దేశమే ఉంటే, 2016 లో తాను పాదయాత్ర చేస్తున్నాడని, తానూ రాకపోగా, మిగతా వైసీపీ ఎమ్మెల్యే లు అందరినీ అసెంబ్లీ కి వెళ్ళద్దని శాసించిన ఘనుడు.

అధికారం ఉన్నప్పుడు అహంకారం నెత్తి మీదకు ఎక్కితే.. పాతాళంలోకి పడిపోవడానికి ఎంతో కాలం పట్టదని.. జగన్ ను చూస్తే అర్థమవుతుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రతి తప్పుడు పనికి ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. తాను అలా ప్రవర్తించానని తెలిసి కూడా.. మనసులో దాచి పెట్టుకుని లేఖలు రాయాల్సిన దుస్థితికి వచ్చింది. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ప్రజలు ఇవ్వలేదు. కానీ టీడీపీకి ఇవ్వడానికి అవకాశం ఉంది.కానీ జగన్ రెడ్డి లాంటి నాయకుడికి పాలుపోస్తే.. అది అది తమనే కాటు వేస్తుందని టీడీపీ నేతలకు తెలియకుండా ఉంటుందా ?

 

 

 

Leave a Comment