తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మూడవ జాబితా విడుదల
పార్లమెంట్ అభ్యర్థులు…….
1. శ్రీకాకుళం – కింజారపు రామ్మోహన్ నాయుడు
2. విశాఖపట్నం – మాత్కుమిల్లి భరత్
3. అమలాపురం – గంటి హరీష్ మాధుర్
4. ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్
5. విజయవాడ – కేశినేని శివనాథ్ (చిన్ని)
6. గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
7. నరసరావుపేట – లావు శ్రీ కృష్ణ దేవరాయలు
8. బాపట్ల టి. కృష్ణ ప్రసాద్
9. నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
10. చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్ రావు
11. కర్నూలు – బస్తిపాటి నాగరాజు(పంచలింగాల నాగరాజు)
12. నంద్యాల – బైరెడ్డి శబరి
13. హిందూపూర్ – బీకే. పార్థసారధి.
మూడవ జాబితా విశేషాలు.
పై జాబితాలో, లావు కృష్ణదేవరాయలు, 2019 లో వైసీపీ నుండి పోటీ చేసి ఎంపీ గా గెలిచారు , 2024 లో టీడీపీ లో చేరారు. లావు కృష్ణదేవరాయలు వైసీపీ లో ఉన్నప్పటికీ, గత 5 ఏళ్లలో అమరావతి రైతుల ఉద్యమానికి మద్దత్తు పలికారు. వేమి రెడ్డి ప్రభాకర రెడ్డి కూడా గత 6 ఏళ్లుగా వైసీపీ రాజ్యసభ ఎంపీ గా పని చేసి, ఇటీవలే వైసీపీ కి రాజీనామా చేసి, టీడీపీ లో చేరారు. ఆర్ధికంగా పరిపుష్టుడైన వేమిరెడ్డి ని టీడీపీ లోకి తీసుకోవడానికి చంద్రబాబు వెనుకాడలేదు, ఈ సారి నెల్లూరు జిల్లాను స్వీప్ చెయ్యాలని, టీడీపీ పట్టుదలతో ప్రయత్నిస్తోంది .