చంద్రబాబు సీఎం గా ఉండగా, వైసీపీ కి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ లోకి వెళ్లిపోయారు. అప్పుడు ఇంటలిజెన్స్ చీఫ్ గా వున్న , A.B.వెంకటేశ్వరరావు , ఈ వైసీపీ ఎమ్మెల్యేలను బెదిరించి, టీడీపీ లోకి వెళ్ళేటట్టుగా చేసారని, అధికారం లోకి రాకముందే జగన్ ఆరోపించాడు. అప్పటినుండే ఆయన మీద కక్ష పెంచుకున్నాడు జగన్.
2019 ఎన్నికలకు ముందే ఇంటెలిజెన్సు చీఫ్ గా వున్న A.B .వెంకటేశ్వరరావు ను తప్పించాలని, జగన్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు కి లెటర్ రాసాడు. చంద్రబాబు అప్పటికే NDA నుండి బయటకు వచ్చేసి, కేంద్ర బీజేపీ మీద పోరాడుతున్నాడు. అందుకే జగన్ కు సహకారం లభించేందేమో, జగన్ లెటర్ రాయగానే, AB ని అప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల్లోనుండి తొలగించింది.
2019 లో వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత పోస్టింగ్ ఇవ్వకుండా వెంకటేశ్వర రావు ను పక్కన పెట్టారు. ఆరు నెలల తర్వాత, టీడీపీ హయంలో ఫోన్ ట్యాపింగ్ డివైసెస్ కొనుగోలు చేసారని, దాన్లో అవకతవలు జరిగాయని, దేశద్రోహంచేశారనే ఆరోపణలతో ఆయన్ని సస్పెండ్ చేసారు. ఒక కేంద్ర సర్వీసుల అధికారిని సస్పెండ్ చేసేముందు పాటించాల్సిన ప్రోసిజర్ కూడా ఏమి ఫాలో అవలేదు, ఆయన్ని వివరణ కూడా అడగలేదు.
దీనిపై AB సుప్రీమ్ కోర్ట్ లో కేసు వేశారు. సుదీర్ఘంగా వాదనలు సాగాయి, కానీ ప్రభుత్వం ఆయన మీద ఆయనపై ఉన్న ఆరోపణలు ఏమిటో మాత్రం నిరూపించలేకపోయింది. చివరికి AB కు అనుకూలంగా , ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని, సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ ఆర్డర్ కాపీ తో , AB , చీఫ్ సెక్రటరీ ని కలుద్దామని వెళితే, CS జవహర్ రెడ్డి అప్పోయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు . AB డైరెక్ట్ గా సచివాలయం కు వచ్చినా, CS కలవకుండా ముఖం చాటేశాడు . దీనితో చేసేది లేక, అతని PA కు order copy ఇచ్చి Acknowledgement తీసుకున్నారు . ఇక తప్పక ఆయనికి ఒక అప్రాధాన్య శాఖ అయిన , తూనికలు కొలతలు శాఖ లో కమిషనర్ పోస్ట్ ఇచ్చారు. ఏది అయినా ప్రభుత్వం ఉద్యోగమే కదా అని, AB అక్కడ చేరారు.
ఏది అయినా ప్రభుత్వం ఉద్యోగమే కదా అని, AB అక్కడ చేరారు. చేరిన కొద్ది కాలానికే మొదటి ఆరోపణలోతేనే 2 వారాల తరువాత రెండవసారి AB ని సస్పెండ్ చేసారు. రెండోసారి సస్పెండ్ చెయ్యకూడదు అనే ప్రొసీడింగ్స్ వున్నా, రెండోసారి సస్పెండ్ చేసారు మళ్ళీ AB పోరాటం మొదలు పెట్టారు, రెండోసారి సస్పెండ్ చెయ్యడానికి సరి అయిన కారణాలు చూపలేదని , తన సస్పెన్షన్ ను సవాలు చేస్తూ, ఈ సారి cat(central administrative tribunal) లో ఫిర్యాదు చేసారు.
సుదీర్ఘంగా వాదనలు సాగాయి, కానీ ప్రభుత్వం ఆయన మీద ఆయనపై ఉన్న ఆరోపణలు ఏమిటో మాత్రం నిరూపించలేకపోయింది.
ఆయన గత నాలుగున్నరేళ్ల కాలంగా సస్పెన్షన్ లోనే ఉన్నారు. డీజీ ర్యాంకులో ఉన్న ఆయన ఇంత కాలం పోస్టింగ్ లేకుండా సస్పెండ్ లో ఉన్నారు CAT లో సుదీర్ఘంగా వాదనలు సాగాయి, కానీ ప్రభుత్వం ఆయన మీద ఆయనపై ఉన్న ఆరోపణలు ఏమిటో మాత్రం నిరూపించలేకపోయింది. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్.. రెండో సారి ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. అయితే ఈ సంవత్సరం మే 8 న , CAT AB కి అనుకూలంగా తీర్పు ఇస్తూ, ఆయన్ని రెండవసారి సస్పెండ్ చెయ్యడం కుదరదు, ఆయనకి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.
CAT ఒక 20 రోజులు ముందు AB కి అనుకూలంగా తీర్పు ఇస్తే, ఆయనికి డీజీపీ పదవి వచ్చి ఉండేది. ఎందుకంటే , కేంద్ర ఎన్నికల కమిషన్ , ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ ని మార్చినపుడు, CS కు సీనియారిటీ ప్రకారం ముగ్గురు డీజీపీ పదవికి అర్హత వున్న పేర్లను పంపమని ఆదేశించింది. . అప్పటికే AB సస్పెన్షన్ చెల్లదు అని CAT తీర్పు వచ్చి ఉంటే, సీనియారిటీ ల అందరికన్నా మొదటి రాంక్ లో వున్న , AB పేరు పంపాల్సి వచ్చేది. దురదృష్టవశాత్తు, ఆ తీర్పు ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త డీజీపీ ని మార్చిన తరువాత వచ్చింది.
CAT లో AB కి అనుకూలంగా తీర్పు ఇచ్చినా, ప్రభుత్వం ఈ రోజు దాకా ఏ నిర్ణయం తీసుకోలేదు , సాగదీస్తున్నాడు. ఎందుకంటె, ఈ నెల మే 31 న AB రిటైర్ అవుతున్నారు. ఆయన వుద్యోగం లో ఉండగా రిటైర్ అవ్వకూడదు అనే పట్టుదలతో వుంది ప్రభుత్వం. ఆయనికి ఒంటిమీద యూనిఫామ్ ఉండకూడదు, గౌరవపరమైన నిష్క్రమణ ఉండకూడదు అనే పట్టుదలతో వుంది. ఇప్పుడు కోడ్ అఫ్ కండక్ట్ వుంది కాబట్టి మాములుగా అయితే, CS, EC కి పంపించాలి, అయితే CS పరిధి దాటి, EC కి పంపించకుండా, సీఎం కు పంపించాడు. పంపడానికి CS కు అధికారం లేదు, అప్పీల్ కు వెళ్ళండి అనే అధికారం సీఎం కు లేదు. అయినా పట్టించుకోకుండా , CAT ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలని , మళ్ళా హై కోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు, కోర్ట్ లో వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పు రిజర్వు లో వుంది. మే 31 లోగా AB కి అనుకూలంగా తీర్పు రావాలని, ఒక నిజాయితీపరుడైన AB గౌరవంగా రిటైర్ అవ్వాలని ఆశిద్దాము.