Revanth Reddy: నేడు తెలంగాణ పునర్నిర్మాణ సభ

నేడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ జరగనుంది. ఈ సభలో లోక్‌‌సభ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. అలాగే కేస్లాపూర్ నాగోబా ఆలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించి, స్మృతి వనానికి శంకుస్థాపన చేయనున్నారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. మొత్తంగా నేడు రూ.160కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి బహిరంగ సభ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభకు లక్ష మంది వస్తారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

Leave a Comment