వైసీపీ మేనిఫెస్టో విడుదల …. టీడీపీలో ఉత్సాహం

రెండు పేజీలతో వైకాపా మేనిఫెస్టో..

జగన్ వైసీపీ 2024 ఎన్ని కల మేనిఫెస్టో విడుదల చేశారు. రెండు పేజీల ఈ మేనిఫెస్టో లో 9 ముఖ్యాంశాలు వున్నాయి.

అమ్మ ఒడి రూ.15వేల నుంచి రూ.17 వేలకు పెం పు;
వైఎస్ఆర్ చేయూత కొనసాగింపు;
వైఎస్ఆర్ కాపు నేస్తం కొనసాగింపు;
మహిళలకు రూ.3లక్షల వరకూ సున్నా వడ్డీ;
సామాజిక పింఛన్లను రెండు విడతల్లో రూ.3500 పెంపు;
కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు ;
అర్హులందరికీ ఇళ్ల పథకం కొనసాగి పు; రూ.2000 కోట్లతో పట్టణాల్లో ఎంఐజీ ఇళ్లు;
రైతుభరోసా సొమ్ము రూ.13,500 నుం చి రూ. 16వేలకు పెంపు; వైద్యం ఆరోగ్య శ్రీ విస్తరణ

వృద్ధుల ఫించన్ల విషయంలో జగన్ తప్పటడుగు వేసినట్టు గా వుంది. మరో నాలుగేళ్ల పాటు మూడు వేల పెన్షనే ఉంటుందని వచ్చే ఎన్నికలకు ముందు రెండు విడతలుగా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుతానని జగన్ హామీ ఇచ్చారు. మొదటి మూడేళ్లు రూ.3 వేలు, ఆ తరువాత 2028లో రూ.250, 2029లో మరో రూ.250 పెంచుతామని చెప్పారు. మొత్తం మీద రూ.3500 ఇస్తామని జగన్ ప్రకటించారు. అదే చంద్రబాబు చూస్తే , ఫించను రూ .,4,000 చేస్తామని , దివ్యాంగులకు ఫించను రూ.6 వేలు పెంచుతామని, పెంచిన ఈ ఫించన్లు ఈ ఏప్రిల్ నుండే ఇస్తామని, జూన్ నెలలో సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత , ఏప్రిల్,మే,జూన్ మొత్తానికి రావలిసిన 4,000 తో కలిపి ఇస్తామని, ప్రతి నెలా ఇంటివద్దే ఈ ఫించన్లు అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ జగన్ చూస్తే , చంద్రబాబు కన్నా, తక్కువ ఫించను ఇస్తామనడం ఏమిటో అర్ధం కావట్లేదు. 64 లక్షల మంది వుండే ఫించను దార్లు ఓట్లు, ఈ సారి టీడీపీ కే ఎక్కువభాగం పడతాయని, ఈ ఓట్ల విషయంలో తమకు దెబ్బ పడుతుందని, వైసీపీ అభిమానులే వాపోతున్నారు.

వైసీపీ మేనిఫెస్టోలో రైతు భరోసా కింద ఏడాదికి రూ.16 వేలు ఇస్తామన్నారు. అందులో కేంద్రం వాటా రూ.6 వేలు ఇప్పటికే అమలవుతోంది. సూపర్‌సిక్స్‌లో భాగంగా రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. రైతు భరోసా అంశంలో చంద్రబాబుదే పై చేయి అయ్యింది.

వైఎస్సార్ చేయూత పథకం 75వేల నుంచి లక్షా 50వేలు పెంచనున్నట్లు ప్రకటించారు. అయితే, అత్యధికంగా లబ్ది పొందే అమ్మ ఒడి పథకానికి మాత్రం రెండు వేలు మాత్రమే పెంచారు , అది కూడా ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది వున్నా ఒక్కరికే వర్తిస్తుంది. అమ్మ వొడి పథకంలో జగన్ 2,000 పెంచినా, చంద్రబాబు చూస్తే , తల్లికి వందనం పథకం క్రింద ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే, అంతమందికీ , 15,000 చొప్పున ఇస్తామని అన్నారు. ఈ అమ్మఒడి అంశంలో కూడా చంద్రబాబుదే పై చేయిగా వుంది.

ఉద్యోగాలు భర్తీ, జాబ్‌ క్యాలెండర్‌ గురించి వైసీపీ మేనిఫెస్టోలో క్లారిటీ లేదు. టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలతో పోలిస్తే.. వైసీపీ మేనిఫెస్టో అంశాలు ప్రజలను ఉత్తేజపరిచేలా లేవన్న అభిప్రాయం వైసీపీ అభ్యర్థుల్లోనే వ్యక్తమౌతోంది

చంద్రబాబు హామీలు చూస్తే , మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం హామీ , నిరుద్యోగులకు ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం, ఉద్యోగం వచ్చేంత వరకూ నెలకు రూ.3 వేలు యువగళం నిధి కింద నిరుద్యోగ భృతి , ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ప్రకటించారు,అలాగే రాగానే మెగా డీఎస్సీ పెడతామని, 50 ఏళ్లు పైబడిన బీసీలకు పింఛన అమలు చేస్తామన్నారు. ఇలా వైసీపీ మేనిఫేస్టోకి, టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలతో పోలిస్తే పొంతన లేదనే అభిప్రాయం అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

13 లక్షల కోట్లు అప్పు చేసిన, వైసీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాల బటన నొక్కుడుకే అధిక ప్రాధాన్యమిచ్చారని, అభివృద్ధి దిశగా ఆశించినంత స్థాయిలో చొరవ చూపలేదని ప్రజలలో ఏర్పడిపోయింది. . ఉదాహరణకు తీసుకుంటే, టీడీపీ కియా మోటర్స్ కంపెనీ తో పాటు అనుబంధ పరిశ్రమలను వెనుకబడిన అనంతపురం జిల్లాకు తెచ్చింది. దీంతో ప్రత్యక్షంగా 8 వేల మందికి.. పరోక్షంగా 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆ జిల్లాకు ఏ ఒక్క పరిశ్రమ రాలేదు. ఏ ఒక్కరికీ ఉద్యోగావకాశాలు దక్కలేదు. అన్ని రంగాలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

సంక్షేమం గత 5 ఏళ్లుగా జగన్ చేసినా, వచ్చే 5 ఏళ్ళు అదే సంక్షేమం చంద్రబాబు చేస్తానని చెప్పినా , జగన్ తో పోలిస్తే, చంద్రబాబు కు అభివృద్ధి విషయంలో చాలా ఎక్కువ మార్కులు పడతాయి.

జగన్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ‘కొత్త సీసాలో పాత సారా’ అని జనం పెదవి విరుస్తున్నారు. 2019 లో విడుదల చేసిన మేనిఫేస్టోనే మళ్లీ విడుదల చేయడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఏదో ఉంటుందని ఆశించిన వైసీపీ అభ్యర్థులు మరింత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన బటన నొక్కుడుకే ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధిని మరిచారు. ఇదే అంశం అభ్యర్థులను భయపెడుతోంది. ప్రజలకు ఏం చెప్పి ఓట్లు అడగాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి తరుణంలో మేనిఫెస్టో తమకు ఊపిరినిస్తుందని అభ్యర్థులు భావించారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. 175కు 175 స్థానాలు గెలవబోతున్నామని ముఖ్యమంత్రే చెబుతుంటే.. మేనిఫేస్టోలో ఏదో అద్భుతం ఉంటుందని ఎదురు చుసిన వైసీపీ అభ్యర్థులు, మేనిఫెస్టో చూసిన తరువాత, వారు ఉసూరుమంటున్నారు. .

వైసీపీ మేనిఫెస్టోతో పోలిస్తే టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలే భేష్‌ అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలు, వివిధ అంశాలను పరిశీలించిన తరువాత ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిదే విజయమని, మేధావి వర్గాలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

Leave a Comment