Responsive Menu
Add more content here...

ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫోన్ టాపింగ్…..?


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నం జరుగుతుందంటూ ఆపిల్ సంస్థ ఈమెయిల్ పంపింది, ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ కాకుండా జాగ్రత్తలు చేపట్టాలని లోకేష్ కు సూచించడంతో, తెలంగాణ లో జరిగినట్టుగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఫోన్ టాపింగ్ జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆపిల్ పంపిన ఈ మెయిల్ తో, ఆంధ్ర ప్రదేశ్ లో తమ ఫోన్ల టాపింగ్ జరుగుతోందని, మేము ఎప్పటినుండో చేస్తున్న ఆరోపణలు నిజమయ్యాయని టీడీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు.

 

లోకేష్ ఫోన్ ట్యాప్ చేసేందుకు ప్రయత్నించారంటూ టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.పెగాసస్ సాఫ్ట్ వేర్ సహాయంతో లోకేష్ ఫోన్ చేసినట్లుగా ఐఫోన్ సందేశాలు వచ్చాయని పేర్కొన్నారు.

లోకేష్ ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ప్రయత్నించిందని ఆపిల్ సంస్థ అలర్ట్ ఇవ్వడంతో… ఈ పని ఎవరు చేసి ఉంటారన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వైసీపీ నేతలే లోకేష్ ఫోన్ టార్గెట్ చేసి ఉంటారన్న ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీకి సంబంధించిన ఐటీ విభాగానికి లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ చేయాలన్న ఆదేశాలు వెళ్లి ఉంటాయన్న అనుమానాలను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా గళం సభలతో చంద్రబాబు బిజీ కావడంతో పార్టీ వ్యవహారాలను లోకేష్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు బదులుగా లోకేష్ ను టార్గెట్ చేసి ఉంటారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ చేపట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లోకేష్ టార్గెట్ గా వైసీపీనే ఈ దుశ్చర్యకు తెరలేపి ఉండొచ్చునని.. అంటున్నారు టీడీపీ మద్దతుదారులు.

 

తెలంగాణ లో ప్రభుత్వం మారగానే, ప్రణీత్ రావు అనే పోలీస్ ఆఫీసర్, ఆఫీస్ లో వున్న, రేవంత్, మరికొంత మంది ప్రముఖ నాయకుల ఫోన్ టాపింగ్ కాల్ రికార్డు లు వున్న , హార్డ్ డిస్క్ లను అడవుల్లో తీసుకెళ్లి, నాశనం చేసాడనే ఆరోపణలతో అరెస్ట్ చేసారు, నెల రోజులు బట్టి అయన జైల్లో వున్నారు, ఇదే నేరం మీద మరికొంత మంది పోలీస్ ఆఫీసర్స్ ను కూడా అరెస్ట్ చేసారు, ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే తంతు జరుగుతోందో లేదో తెలిసేది ప్రభుత్వం మారితేనే. తాము అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన తరువాత, తెలంగాణ మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ లో ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చి, నిందితులను చట్ట ప్రకారం శిక్షిస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *