జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ , ఇది జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ ఉంటుంది. కానీ జనసేన పోటీ చెయ్యని చోట, రాష్ట్రంలో ఇండిపెండెంట్ కేండిడేట్స్ పోటీ చేసే స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తున్నారు. దీనితో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి లో గుబులు మొదలయ్యింది.
ఎందుకిలా జరిగింది?
ఎన్నికల సంఘం రూల్ ప్రకారం , గుర్తింపు పొందిన పార్టీ కి కామన్ సింబల్ ఇస్తారు. జనసేన పార్టీ ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు పొందింది. దాని ప్రకారం జనసేన కు కామన్ సింబల్ గా ఎన్నికల సంఘం , గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది. కానీ ఈ గాజు గ్లాస్ జనసేన పార్టీ కి రిజర్వ్ చెయ్యలేదు. ఇలా ఒక గుర్తు ఒక పార్టీ కి రిజర్వ్ అవ్వాలంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లు గాని, 2 అసెంబ్లీ సీట్లు గాని, ఒక ఎంపీ సీట్ గాని గెలిచి ఉండాలి. జనసేన ఈ అర్హతలలో యే ఒక్కటీ సాధించలేదు. . అందుకే గాజు గ్లాస్ గుర్తు, జనసేన కు రిజర్వు చెయ్యలేదు.
మాములుగా జనసేన ఒంటరిగా పోటీ చేస్తే, ఆ పార్టీ కి , మిగతా స్థానాల్లో, ఇండిపెండెంట్లకు , తమ గుర్తు ఇచ్చినా సమస్య లేదు. కానీ ఇప్పుడు జనసేన , టీడీపీ-బీజేపీ తో కలిసి ఒక కూటమి లో పోటీ చేస్తోంది. దీని ప్రకారం జనసేన 21 అసెంబ్లీ స్థానాలు మినహా, మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేసే చోట ,జనసేన గుర్తు ఉండదు , కాబట్టి, జనసేన ఓటర్లు, టీడీపీ సైకిల్ గుర్తుకు వోట్ వెయ్యాలి. ఆ ఉద్దేశ్యంతోనే కూటమిగా కూడింది,. జనసేన ఓట్లు, టీడీపీ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. కానీ అక్కడ, ఈవీఎం లో సైకిల్ తో పాటు, ,ఇండిపెండెంట్ లకు కేటాయించిన గ్లాస్ గుర్తు కూడా ఉండటం వలన, కొంతమంది జనసేన అభిమానులు, అలాగే సరి అయిన అక్షర జ్ఞానం లేనివారు, వృద్దులు, గాజు గ్లాస్ గుర్తు ఉండటం వలన, జనసేన ఎటూ టీడీపీ తో పొత్తు లో వుంది కాబట్టి, సైకిల్ గుర్తుకు బదులు గాజు గ్లాస్ గుర్తు వున్న , ఇండిపెండెంట్ కు వోట్ వేసేస్తారు , ఆలా టీడీపీ కి పడాల్సిన ఓట్లు, ఇండిపెండెంట్ కు పడిపోతాయి. ఇలా 1000 నుండి 2000 ఓట్లు పోయినా టీడీపీ కి చాలా దెబ్బ పడుతుంది. ఆ 1000,2000 ఓట్లు కూడా ఫలితాన్ని తారుమారు చేసి, టీడీపీ ఓడిపోయే ప్రమాదం వుంది.
గాజు గ్లాస్ గుర్తు మరెవరికీ కేటాయించొద్దని కూటమి నేతలు ఎప్పుడో ఈసీకి విజ్ఞప్తి చేసారు. ఎన్నికల సంఘం దానికి అంగీకరించింది కూడా ఆదివారం నాడు అబ్బే.. ఎవరికీ కేటాయించే పరిస్థితి లేదన్న ఎన్నికల సంఘం.. ఒక్కరోజు గ్యాప్‌లోనే నామినేషన్ల విత్ డ్రా ముగిసిన నిమిషాల వ్యవధిలోనే టీడీపీ,జనసేన రెబల్స్, ఇండిపెండెంట్లకు , ఈ గాజు గ్లాస్ గుర్తు అడిగిన స్వతంత్ర అభ్యర్థులకు ఇచ్చేసింది. గాజు గ్లాస్ గుర్తు కావాలని ఒకరి కంటే ఎక్కువ స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడితే, లాటరీ వేసి, గెలించిన వారికి ఈ గాజు గ్లాస్ గుర్తు కేటాయించేసారు. దీనితో కూటమి పార్టీలకు గుబులు మొదలయ్యింది.
మాములుగా జనసేన ఒంటరిగా పోటీ చేస్తే, ఆ పార్టీ కి , మిగతా స్థానాల్లో, ఇండిపెండెంట్లకు , తమ గుర్తు ఇచ్చినా సమస్య లేదు. కానీ ఇప్పుడు జనసేన , టీడీపీ-బీజేపీ తో కలిసి ఒక కూటమి లో పోటీ చేస్తోంది. దీని ప్రకారం జనసేన 21 అసెంబ్లీ స్థానాలు మినహా, మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేసే చోట ,జనసేన గుర్తు ఉండదు , కాబట్టి, జనసేన ఓటర్లు, టీడీపీ సైకిల్ గుర్తుకు వోట్ వెయ్యాలి. ఆ ఉద్దేశ్యంతోనే కూటమిగా కూడింది,. జనసేన ఓట్లు, టీడీపీ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. కానీ అక్కడ, ఈవీఎం లో సైకిల్ తో పాటు, ,ఇండిపెండెంట్ లకు కేటాయించిన గ్లాస్ గుర్తు కూడా ఉండటం వలన, కొంతమంది జనసేన అభిమానులు, అలాగే సరి అయిన అక్షర జ్ఞానం లేనివారు, వృద్దులు, గాజు గ్లాస్ గుర్తు ఉండటం వలన, జనసేన ఎటూ టీడీపీ తో పొత్తు లో వుంది కాబట్టి, సైకిల్ గుర్తుకు బదులు గాజు గ్లాస్ గుర్తు వున్న , ఇండిపెండెంట్ కు వోట్ వేసేస్తారు , ఆలా టీడీపీ కి పడాల్సిన ఓట్లు, ఇండిపెండెంట్‌కు పడిపోతాయి. ఇలా 1000 నుండి 2000 ఓట్లు పోయినా టీడీపీ కి చాలా దెబ్బ పడుతుంది. ఆ 1000, 2000 ఓట్లు కూడా ఫలితాన్ని తారుమారు చేసి, టీడీపీ ఓడిపోయే ప్రమాదం వుంది.
గాజు గ్లాస్ గుర్తు మరెవరికీ కేటాయించొద్దని కూటమి నేతలు ఎప్పుడో ఈసీకి విజ్ఞప్తి చేసారు. ఎన్నికల సంఘం దానికి అంగీకరించింది కూడా. ఆదివారం వరకు అబ్బే.. ఎవరికీ కేటాయించే పరిస్థితి లేదన్న ఎన్నికల సంఘం.. ఒక్కరోజు గ్యాప్‌లోనే నామినేషన్ల విత్ డ్రా ముగిసిన నిమిషాల వ్యవధిలోనే టీడీపీ,జనసేన రెబల్స్, ఇండిపెండెంట్లకు , ఈ గాజు గ్లాస్ గుర్తు అడిగిన స్వతంత్ర అభ్యర్థులకు ఇచ్చేసింది. గాజు గ్లాస్ గుర్తు కావాలని ఒకరి కంటే ఎక్కువ స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడితే, లాటరీ వేసి, గెలించిన వారికి ఈ గాజు గ్లాస్ గుర్తు కేటాయించేసారు. దీనితో కూటమి పార్టీలకు గుబులు మొదలయ్యింది.
టీడీపీ,జనసేన , ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ కి బలం లేకపోయినా, బీజేపీ తో పొత్తుపెట్టుకుని, వారికి 9 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు ఇచ్చినది, బీజేపీ తో పొత్తు ఉంటే, కేంద్ర ,రాష్ట్ర ఎన్నికల కమిషన్స నుండి హకారం వుంటుందనే. ఇప్పటికే CS ,డీజీపీ ని మార్చమని కూటమి పార్టీ ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసినా, ఈసీ పట్టించుకోలేదు , దానికి తోడు, ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు విషయం లో ఈసీ సహకారం లేకపోవడంతో, బీజేపీ తమకు ద్రోహం చేస్తోందనే భావన క్రమేపీ టీడీపీ,జనసేన లో బలపడుతోంది.
ఈ విషయం లో జగన్ కుట్ర చేస్తున్నారని.. లేకుంటే ఇదెలా సాధ్యమంటూ, కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నిలకు ముందు చేతులెత్తేసిన జగన్ ఇలా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. కూటమి నేతలు పోటీచేస్తున్న చోట అదే పేరుతో ఉండే అభ్యర్థులను సైతం బరిలోకి దింపడం మరో దారుణమైన విషయమని టీడీపీ పార్టీ ఆరోపిస్తోంది.
ఈ విషయమై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ను జనసేన అడ్వొకేట్లు ఆశ్రయించారు, కోర్ట్ లో జరిగిన వాదనలు సందర్భంగా , జనసేన వాదించినది, తమకు రిజర్వు గుర్తు లేకపోయినా, రాష్ట్రంలో ,జనసేన పోటీ చేయని చోట్ల, తమతో పొత్తు లో వున్న పార్టీలకు తాము ప్రచారం చెయ్యాలని, కానీ ఆ స్థానాల్లో, స్వతంత్రులకు తమ గాజు గ్లాస్ గుర్తు ఇవ్వడం వలన, అక్కడ ఓటర్లలో గందరగోళం ఏర్పడుతుందని , దీనివల్ల తమకు నష్టం జరుగుతుందని, ఈ కారణం తో, గాజు గ్లాస్ గుర్తు ,జనసేన పోటీ చెయ్యని స్థానాల్లో ఇవ్వకూడదని అభ్యర్ధించింది. హై కోర్ట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను వివరణ కోరగా, తాము ఈ గందరగోళాన్ని 24 గంటల్లో సరిచేస్తామని ,ఈసీ లాయర్లు చెప్పారు. హై కోర్ట్ ఈ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. తమకు సానుకూలంగా తీర్పు వస్తుందని జనసేన ,కూటమి వర్గాలు ఆశాభవం వ్యక్తం చేసాయి.
అటు ఢిల్లీ లో కూడా టీడీపీ రాజ్య సభ సభ్యడు కనకమేడల కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి, ఈ సమస్యను పరిష్కరించాలని ,విజ్ఞాపన లేఖ అందజేశారు.
ఇప్పటికే గాజు గ్లాస్ గుర్తు కేటాయించిన అభ్యర్థుల వివరాలు .
విజయనగరం మాజీ ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ అభ్యర్థి మీసాల గీత
మైలవరం స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగ పవన్ కుమార్
విజయవాడ సెంట్రల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్
టెక్కలిలో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేష్
కాకినాడ జిల్లా.. జగ్గంపేట స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర
పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుమారుడు నంబూరు కళ్యాణ్ బాబు
గన్నవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని వంశీమోహన కృష్ణ
అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న దళిత బహుజన పార్టీ చెందిన వడ్లమూరి కృష్ణ స్వరూప
మంగళగిరిలో రావుసుబ్రహ్మణ్యం
మదనపల్లె ఇండిపెండెంట్ అభ్యర్థి షాజహాన్‌లకు ఆయా నియోజకవర్గాల ఆర్వోలు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం జరిగింది.