ఈ రెండు దేశాలకూ……….వెళ్ళవద్దు.

 

 

 

 

 

 

ఈ రెండు దేశాలు వెళ్లేవారు కొంత కాలం ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

ఆ దేశాలు ఏమిటంటే, ఇరాన్, ఇజ్రాయేల్ .

ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాం.. ఏ రాత్రి అయినా దాడి చేసే అవకాశం వుంది జాగ్రత్త .. ఇది ఇరాన్ హెచ్చరిక, ఇరాన్ నుండి వచ్చే మిస్సైల్ కోసం ఎదురు చూస్తున్నాం..ఇది ఇజ్రాయెల్ రియాక్షన్.

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి.

దాడి వెనుక నేపధ్యం

ఏప్రిల్ 1న ఇరాన్ ఎంబసీ పై దాడి జరిగింది. ఆ దాడి కారణంగా ఇరాన్ కు చెందిన 16 మంది సీనియర్ కమాండర్లు మరణించారు. ఇది ఇజ్రాయేల్ పనే అని ఇరాన్ ఆరోపించింది. దానికి ప్రతీకారంగానే ఇజ్రాయేల్ పై దాడి చేస్తామని ఇరాన్ పేర్కొంది. అయితే, ఇరాన్ ఎంబసీ పై జరిగిన దాడులకు ,తమకు సంబంధం లేదని, ఇజ్రాయేల్ అంటోంది.

నిన్న ఉదయం అమెరికా ఒక ప్రకటన చేస్తూ ఇరాన్ ఏ క్షణమైనా ఇజ్రాయెల్ మీదకి దాడికి దిగవచ్చు , అందువల్ల ఆ దేశాలకు ప్రయాణాలు మనుకోమని హెచ్చరించింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందంటూ ప్రముఖ జర్నల్ వాల్ స్ట్రీట్ ఓ కథనం కూడా ప్రచురించింది భారత్ తో సహా, జెర్మనీ, ఫ్రాన్స్ లు కూడా తమ పౌరులు ఇజ్రాయెల్, ఇరాన్ లలో ఉంటే వెంటనే వెనక్కి రావాల్సిందిగా కోరాయి. జెర్మనీ ఎయిర్ లైన్స్ luftansa తన సర్వీసులను ఆ దేశాలకు రద్దు చేసింది.

 

 

భారత్ విషయానికి వస్తే,

ఇరాన్ లో 4 వేల మంది, ఇజ్రాయెల్ లో 18,500 మంది భారతీయులు నివసిస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో పర్యటించడం ఏమాత్రం సురక్షితం కాదని భారత విదేశీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ రెండు దేశాలకు వెళ్ళేవారు కొంతకాలం ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. అదే సమయంలో భారతీయ ఎంబసీలతో అక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు భారత విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడిస్తోంది.

ఈ రెండు దేశాలలో ఉన్న భారతీయులు భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలని కోరింది.

Leave a Comment