మీ భార్యల చీరెల్ని తగులబెట్టండి………….

ఈ వ్యాఖ్యలు చేసింది, సాక్ష్యాత్తూ  ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా.

ఎందుకిలా అన్నారు ?

మన ఇండియన్స్ అప్పట్లో, ‘చైనా వస్తువులు’ బహిష్కరణ’ అనే అంశం మీద ఆన్ లైన్ ఉద్యమాలు చేసారు కదా, ఇప్పుడు బాంగ్లాదేశ్ లో ప్రతిపక్షాలు ఆన్ లైన్ లో, ‘భారత ఉత్పత్తుల బహిష్కరణ’ అనే అంశం మీద ఉద్యమాన్ని ప్రారంభించాయి.

ఎందుకంటె, త్వరలో, అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ప్రతిపక్షాలన్నీ , అధికార పక్షాన్ని టార్గెట్ చెయ్యాలి. ఆలా చెయ్యడానికి వారికీ దొరికిన అంశమే, ‘భారత ఉత్పత్తుల బహిష్కరణ’ అనే అంశం. ప్రస్తుత ప్రధానమంత్రి హసీనా భారత అనుకూలురుగా ముద్రపడ్డారు. షేక్ హసీనా ఇండియాతో స్నేహాన్ని కోరుకుంటుంది…గత ఎన్నికల్లో, ఆమె పార్టీ అవామీ లీగ్ ఘనవిజయం సాధించడానికి ఇండియా దోహదపడిందని , ప్రతిపక్షాలు ఆరోపణలకు దిగాయి… ఆ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ Bangladesh National Party (BNP) పోలింగ్ బహిష్కరించింది .

 
అధికార పార్టీ అవామీ లీగ్, ‘ప్రొ-ఇండియా’ కాబట్టి , ప్రతిపక్షాలు యాంటీ ఇండియా క్యాంపెయిన్ వైపు వెళ్ళడానికి ఇదీ నేపధ్యం. …

 
భారతీయ చీరలను ఇష్టపడే, అధికార పార్టీ అవామీ లీగ్, దాని అధినేత-ప్రధాని షేక్ హసీనా ప్రతిపక్షాలకు , ఈ యాంటీ ఇండియా క్యాంపెయిన్ కు కౌంటర్ ఇచ్చారు.

‘మీరు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని చెప్పే ముందు మీ భార్యలను ఇండియా నుండి తెప్పించే చీరలను కట్టుకోకుండా ఆపండి, … మీలో చాలామంది భార్యలే స్వయంగా ఇండియన్ చీరెలను తెప్పిస్తారు, ఇక్కడ అమ్ముకుంటారు, పైగా భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని ఫేక్ పిలుపులు దేనికి.. ? ఓ పనిచేయండి, మీరు మీ ఇళ్లల్లో ఉన్న, మీ భార్యల చీరల్ని వీధుల్లోకి తీసుకొచ్చి దహనం చేయండి, అప్పుడు ప్రజలు మీ ఉద్యమాన్ని నిజమైన ఉద్యమంగా నమ్ముతారు.

గత వారం, మార్చి 26న బంగ్లాదేశ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, ప్రతిపక్ష BNP, మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులను బహిష్కరించాలనే కాంపెయిన్ మీద విరుచుకు పడిన హసీనా, దానికి ఆమె ఇచ్చిన కౌంటర్, భారతీయ చీరలు అనే అంశం దాటి , ఉల్లి, వెల్లుల్లి, అల్లం మొదలైన భారతీయ మసాలా ద్రవ్యాలపై కూడా ఇచ్చింది.

మీ భార్యలకు చెప్పండి, మీ మీ ఇళ్లల్లో వంటల్లో, భారత్ నుండి తెప్పించే మసాలా దినుసులు వాడద్దని. భారత ఉత్పత్తులు బహిష్కరించాలంటే, వీటిని కూడా బహిష్కరించాలి కదా”. బంగ్లాదేశ్ , మసాలా ద్రవ్యాలకు, ఇండియానుంచి దిగుమతులపైనే ఎక్కువ ఆధారపడతారు…

బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా, న్యూఢిల్లీతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడంలో ప్రసిద్ధి చెందారు. దీనితో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (BNP) దేశంలో భారత వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి, ఎన్నికలలో లాభాలు పొందే ప్రయత్నంలో ఉంది. మొత్తానికి బాంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రచార యుద్ధం , ఇండియా చుట్టే తిరుగుతోంది.

కొసమెరుపు : ఇటీవలే మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ కు, 50 వేల టన్నుల ఉల్లి ఎగుమతులకుఅనుమతించింది.

 

 

1 thought on “మీ భార్యల చీరెల్ని తగులబెట్టండి………….”

Leave a Comment