2019 లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడం కోసమని రూ.5వేల గౌరవ వేతనంతో, 2.5 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. 50 నుంచి 100 కుటుంబాలకు ఒక వాలంటీ నియమించారు.. వీరిని ఎలా నియమించారో, దానికి మార్గదర్శకాలు ఏమిటో తెలియదు. మొదట్లో బాగానే వున్నా, రాను రాను అధికార పార్టీ కే వత్తాసు పలికే లా ఈ వ్యవస్థ తయారయ్యింది. విజయసాయి రెడ్డి ,చాలా మంది వైసీపీ మంత్రులు, వాలంటీర్లు 90% మంది వైసీపీ కార్యకర్తలే అని బహిరంగంగా వ్యాఖ్యానించడంతో, ఆ వాలంటీర్ల అధికార పార్టీ కే పని చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించడం మొదలు పెట్టాయి.
జడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు, ఈ వాలంటీర్లు వైసీపీ ఎమ్మెల్యేల ఆదేశంతో, ప్రతి ఇంటికి వెళ్లి, వైసీపీ ని గెలిపించుకుంటేనే మీకు పథకాలు అందుతాయి, వైసీపీ పార్టీ కి వోట్ వెయ్యకపోతే, పథకాలు అందవని బెదిరించే దృశ్యాలు , చాలా ఛానల్స్ ప్రసారం చేసాయి. అంతే కాదు, వీరు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తూ, ప్రభుతం వ్యతిరేక, ప్రతిపక్ష పార్టీ అనుకూలురు ఎవ్వరు అని గుర్తించి, ఆ సమాచారం పై అధికారులకు చేరవేయడంతో, టీడీపీ,జనసేన సానుభూతిపరులు ఓట్లు చాలా తొలగించారని, ఎన్నికల కమిషన్ కు టీడీపీ,జనసేన,బీజేపీ పార్టీలు ఫిర్యాదు చేసాయి, సాక్షాత్తు, టీడీపీ అధినేత చంద్రబాబే ఢిల్లీ వెళ్లి, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఈ ఓట్ల తొలగింపు పై ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
అయితే 2024 అసెంబ్లీ, ఎన్నికలకు, గెలుపుకోసం ప్రతిపక్షాలు చావో రేవో అని పోరాడుతున్న వేళ, ఈ వాలంటీర్లు, ప్రతి ఇంటికి వెళ్లి, మళ్ళీ జగన్ వస్తేనే ఈ పథకాలు వస్తాయి, టీడీపీ వస్తే ఈ పథకాలు రద్దు చేస్తారని, వైసీపీ పార్టీకే వోట్ వెయ్యాలని బహిరంగంగా ప్రచారం చెయ్యడంతో, రగిలిన ప్రతిపక్ష పార్టీ లు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసాయి. ఈ వాలంటీర్లకు, ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1500 కోట్లు ప్రజలు డబ్బే జీతం గా ఇస్తోందని, వారు ఒక రకంగా ప్రభుత్వం ఉద్యోగులు కావున, ఒక పార్టీ కే ఎలా ప్రచారం చేస్తారని, EC కి ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నాయి.
రిటైర్డ్ ఐఏఎస్ లు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధ్యక్షుడిగా, ఎల్.వి .సుబ్రహమణ్యం మొదలైన వారు సభ్యులుగా వున్న , సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ హై కోర్ట్ లో ఒక పిటిషన్ వేసింది, ఎలక్షన్ కోడ్ వచ్చాక, ఇంటింటికీ వెళ్లే ఈ వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్న కారణాన, కావున, ఈ వాలంటీర్ల చేత ఇంటింటికీ వెళ్లి ఫించన్లు అందచేసే కార్యక్రమాన్ని ఆపించాలని కోరింది. హై కోర్ట్ వారికి అనుకూలంగా తీర్పు ఇస్తూ, వాలంటీర్లను ఎన్నికలయిపోయేదాకా విధుల్లో పాల్గొనవద్దని తీర్పు చెప్పింది.
వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలు. అందులోసందేహం లేదు. కానీ ఎన్నికల ప్రక్రియలో వారి జోక్యం ఉండకుండా ఈసీ చర్యలు తీసుకోవడంతో వారితో రాజీనామాలు చేయించి పోలింగ్ బూతుల్లో ఏజెంట్లుగా కూర్చోబెట్టి ప్రజల్ని భయపెట్టాలని అనుకున్నారు. దీనితో ఎన్నికలయిపోయేదాకా, ఈ వాలంటీర్ల ద్వారా ప్రచారం చేయించుకోవాలనుకుంటున్న వైసీపీ నాయకులు చాలా మంది వాలంటీర్లను రాజీనామా చేసి ఎన్నికల ప్రచారం లో పాల్గొనాలని, వచ్చేది వైసీపీ ప్రభుత్వమే , మిమ్మల్ని మళ్ళీ విధుల్లో తీసుకుంటాము అని ఆశ చూపించింది, బెదిరించింది,వత్తిడి చేసింది . దీనికి విరుగుడుగా చంద్రబాబు, వాలంటీర్లు వైసీపీ ట్రాప్ లో పడద్దని, తమ ప్రభుత్వం వచ్చాక, ఈ వాలంటీర్లను కొనసాగిస్తామని, వారికి జీతం 5,000 నుండి 10,000 పెంచుతామని చెప్పింది. అయినా చంద్రబాబు హామీని పెడచెవిని పెట్టి, 2.5 లక్షల వాలంటీర్లలో , ఒక లక్ష మంది రాజీనామా చేసి, వైసీపీ తరుపున ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. మిగతావారు చంద్రబాబు హామీలు నమ్మి, రాజీనామా లు చెయ్యకుండా ,విధుల్లో పాల్గొనకుండా ,ఇంటిపట్టునే ఉండి పోయారు, తటస్థంగా ఉండిపోయారు. జూన్ 4 న పోలింగ్ రోజు, రాజీనామా చేసిన ఈ లక్ష వాలంటీర్లు , గ్రామాల్లో చాలా మంది ఓటర్లను, పోలింగ్ బూత్ కు తీసుకొచ్చి, వైసీపీ కి వోట్ వేయించారు. అందుకనే, పోలింగ్ ముగిసాక, వైసీపీ , తామే గెలుస్తామని, దానికి ఒక కారణంగా ఈ వాలంటీర్లు, చాలా మంది ఓటర్లను పోలింగ్ బూత్ ల దగ్గరికి తీసుకొచ్చి, దగ్గరుండి వైసీపీ కి వోట్ వేయించడం అని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి, టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఇంతవరకు ఈ వాలంటీర్ల కొనసాగింపు పై ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. రాజీనామా చెయ్యకుండా వుండిపోయిన వాలంటీర్లు ,10,000 జీతంతో తమని కొనసాగిస్తారని ధీమాతో ఆనందంగా ఉండగా, రాజీనామా చేసిన వాలంటీర్లు మాత్రం, ఇప్పుడు లబో దిబో మంటున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లు, తమను మళ్ళీ ఉద్యోగంలోకి టీడీపీ నేతల వద్దకు పరుగులు పెడుతున్నారు. తమతో బలవంతంంగా రాజీనామాలు చేయించారని వైసీపీ నేతలపై పోలీసులుకు ఫిర్యాాదు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో సగం మంది రాజీనామా చేయలేదు. లక్ష మందికిపైగా రాజీనామా చేశారు. టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ల జీతాలను పదివేలకు పెంచుతామని.. ఇతర ఉపాధి చూపిస్తామని హామీ ఇచ్చింది. దీంతో రాజీనామా చేసిన వాలంటీర్లంతా గగ్గోలు పెడుతున్నారు. మళ్లీ తమను తీసుకోవాలని అంటున్నారు. అయితే రాజీనామా చేసిన వాలంటీర్లు సైలెంట్ గా ఉండలేదు… ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. వైసీపీ కోసం పని చేశారు. చివరికి ఎటూ కాకుండా పోయారు. ప్రభుత్వం ఇంకా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకోలేదు. వాటిపై పరిశీలన చేసి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజీనామా చేసిన వాలంటీర్లను మాత్రం మళ్లీ తీసుకునే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు.