ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. 2014 తో పోలిస్తే, టీడీపీ సంక్షేమ పథకాలు మరిన్ని ఈ మేనిఫెస్టో లో పెట్టింది. వివరాలు ఇలా వున్నాయి.
వృద్ధాప్య పెన్షన్ 4000కు పెంచడం దివ్యాంగులకు పెన్షన్ 6000 ఇవ్వడం.
వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000
మహిళలకు మహాశక్తి పథకం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, తల్లికి వందనం క్రింద, ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15,000 కోట్లు చొప్పున ఇవ్వడం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు
అమరావతి నిర్మాణం, మెగా డీఎస్సీ, ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్,
యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
ఏప్రిల్ నుంచే వృద్ధులకు నాలుగు వేల పెన్షన్, ఉచిత ఇసుక ఇవ్వడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, భూ హక్కు చట్టం రద్దు, ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్,
జూన్ లో ప్రభుత్వం ఏర్పడగానే మొదటి నెల ఏడు వేల రూపాయలు
ఉచిత ఇసుక ఇవ్వడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, భూ హక్కు చట్టం రద్దు, ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్,
బీసీ రక్షణ చట్టం, చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500యూనిట్ల విద్యుత్ ఫ్రీ,
పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం, పెళ్లి కానుక 1,00,000
ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కూడా కల్పిస్తారు.
దేవాలయాల్లో పని చేస్తున్న నాయినబ్రాహ్మణులకు గౌరవేతనంగా 25000, షాపులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితం
మైనార్టీలకు హజ్ యాత్రకు రూ. లక్ష సాయం
ఈద్గాలు, ఖబరిస్తాన్ల కోసం స్థలాలు ,విజయవాడ సమీపంలో హజ్ హౌస్ , నూర్ బాషా కార్పొరేషన్‌కు ఏటా 100 కోట్లు
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీలేని రుణాలు , ఇమామ్‌లకు పదివేలు, మౌజామ్లకు ఐదు వేలు గౌరవేతనం .
అర్హత ఉన్న ఇమామ్‌లకు ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తారు. మసీదుల నిర్వహణకు నెల ఐదువేల ఆర్థిక సాయం అందిస్తారు.
బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షా 50 వేలు కోట్లు ఖర్చు చేస్తారు
ఆదరణ కింద ఐదు వేల కోట్లు ఖర్చు , వారసత్వ వృత్తిపై ఆధార పడే వాళ్లకు ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఇవ్వించడం
చేనేత పరిశ్రమకు ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు పవర్ లూమ్స్‌కు ఐదు వందల యూనిట్లు,
హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్,
ఇబ్బందుల్లో ఉన్న చేనేత కుటుంబాలకు ఏడాదికి 24,000 రూపాయలు ఆర్థిక సాయం
గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్లు ,
వడ్డెర్లకు క్వారీల్లో 15% రిజర్వేషన్
రజక, దోబీ ఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహకాలు, దోబీ ఘాట్ల కోసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్,
మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20 వేల ఆర్థిక సాయం చెయ్యడం .
217 జీవో రద్దు, కొత్త బోట్లు, ఉన్న బోట్ల మరమ్మతులు చేపించడం , స్వర్ణకారుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ పథకాలు అమలు చేస్తారు.