సజ్జల రాజీనామా తప్పదా……?

 

 

 

 

 

సజ్జల రామకృష్ణ రెడ్డి , ప్రతిపక్షాలు పిలిచేది సకల శాఖా మంత్రి ఈ పేరు 2019 లో జగన్ అధికారంలోకి వచ్చేదాకా అంతగా తెలియని పేరు. ఆయన మొదటి ఈనాడు లో జర్నలిస్ట్ గా పని చేసాడు, తరువాత సాక్షి లో చేరాడు. సాక్షి లో ఎడిటర్ స్థాయికి ఎదిగాడు, 2019 ఎన్నికల ముందు వైసీపీ పార్టీ లో క్రియాశీలకంగా పని చేసాడు. 2019 లో జగన్ అధికారం లోకి వచ్చాక, ఒక్కసారిగా ఈయన దశ మారిపోయింది . ప్రతిపక్షాల లెక్కల ప్రకారం వైసీపీ ప్రభుత్వం 600 మంది సలహాదారుల్ని నియమించుకున్నా, ప్రభుత్వం ముఖ్య సలహాదారు గా సజ్జలను నియమించారు. ఈయనకు నెల జీతం కొన్ని లక్షలు అనుకునేవారు. కానీ జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ బయటపెట్టినదాని ప్రకారం ఈయన నెల జీతం కొన్ని కోట్లు ఉంటుందని తెలిసింది. ఈయనకు ఇచ్చే జీతం ప్రజలు ప్రభుత్వానికి పన్నుల రూపం లో కట్టిన డబ్బులోనుండి ఇచ్చేదే .

పేరుకు ప్రభుత్వం ముఖ్య సలహాదారుడిగా వున్నా, వైసీపీ పార్టీ మొత్తం పార్టీ వ్యవహారాలు చూసేది ఈయనే. జగన్ ను కలవాలంటే, ముందు సజ్జల అప్పోయింట్మెంట్ దొరకాలని వైసీపీ ఎమ్మెల్యేలే అంటారు. ఈ 5 ఏళ్ళు ప్రతి మంత్రిత్వ శాఖలోనూ ఈయనే వేలు పెట్టేసి, వారి బదులు ఈయనే ప్రెస్ మీట్ లు పెట్టి, మంత్రులను ఉత్సవ విగ్రహాలుగా చేసాడని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. జగన్, పేరుకు బీసీ లకు ఇన్ని, ఎస్సీ లకు ఇన్ని మంత్రి పదవులు ఇచ్చామని చెప్పుకున్నా, ఆ మంత్రులు ఉత్సవ విగ్రహాలే, వారికి ఏ అధికారాలు లేవని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. ఈ 5 ఏళ్లలో ఆంధ్ర ప్రదేశ్ హోమ్ మంత్రి నిర్వహించిన ప్రెస్ మీట్ లు చాలా తక్కువ. హోమ్ మంత్రి కి బదులుగా సజ్జల నిర్వహించే ప్రెస్ మీట్లే ఎక్కువ.

ఇప్పుడు ఈయన గురించి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే

సజ్జల ప్రభుత్వం ముఖ్య సలహాదారు, అంటే ప్రభుత్వం దగ్గరనుండి జీతం తీసుకునే ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి గా వుంటూ ఈయన వైసీపీ పార్టీ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని, వైసీపీ పార్టీ ప్రెస్ మీట్లు ఎలా పెడతారని ,ఇది నిబంధనలు విరుద్ధం అని ప్రతిపక్షాలు ఎన్ని సార్లు విమర్శించినా సజ్జల ఖాతరు చెయ్యలేదు.

ఎలెక్షన్ కోడ్ అమలులోకి వచ్చినా , ప్రస్తుతం అధికారాలు లేని, ఆపద్ధర్మ ప్రభుత్వమే వున్నా, ఈయన ఇదివరకు లాగే వైసీపీ పార్టీ తరుపున ప్రెస్ మీట్ లు పెట్టడం మానలేదు. దీనితో ఆగ్రహించిన టీడీపీ,జనసేన,బీజేపీ పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సజ్జల పై ఫిర్యాదు చేసారు. దానితో ఈసీ రంగంలోకి దిగింది.

ఎగ్జిక్యూటివ్ బాడీ ఆదేశాలతో, క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం నుండి జీత భత్యాలు పొందుతున్న దాదాపు 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది అని స్పష్టం చేస్తూ భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.

ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి ఎన్నికల కమీషన్ కు అనేక ఫిర్యాదులు అందాయని, నిర్దేశిత పనికి బదులుగా, వారు రాజకీయ ప్రచారం/రంగంలోకి ప్రవేశిస్తున్నారని మరియు ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారని కమిషన్ గుర్తించింది.

ప్రభుత్వ మంత్రికి ఎన్నికల కోడ్ వర్తించే విధంగా ఈ సలహాదారులకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని ఈసీఐ స్పష్టంచేసింది. కమిషన్ యొక్క ఈ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘిచినా తీవ్రంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాలకు లోబడి కఠినమైన చర్యలను తీసుకోవడం కూడా జరుగుతుంది ఈసీఐ స్పష్టం చేసింది.

సలహాదారులందరిలోకి చీఫ్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ అభ్యర్థుల ప్రకటన దగ్గర్నుంచి వైసీపీ వ్యవహారాలన్నీ చక్క బెడుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ.. బీజేపీని విమర్శిస్తున్నారు. చివరికి ప్రధాని మోదీ సభపైనా కామెంట్లు చేశారు. కానీ ఆయన కు ఏ రూల్స్ వర్తించడం లేదు.

ఇతర సలహాదారుల గురించి చెప్పాల్సిన పని లేదు. వారు నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంత కాలం కోడ్ ఉల్లంఘించిన దానికి సజ్జలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సజ్జల పార్టీ తరపున ప్రెస్ మీట్ పెట్టాలంటే, తన సలహాదారు పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజీనామా చేస్తారా లేకపోతే.. ఈసీ ఆదేశాలు లెక్కజేయరో చూడాలి.

Leave a Comment