రాయి దాడి….. మరో కోడి కత్తి v2.0 ?

 

 

 

 

 

 

13 వ తారీఖు, రాత్రి 8 గంటలకు విజయవాడ రోడ్ షో లో, ఒక రోడ్ షో చేస్తున్న జగన్ మీద , క్రింద నిలుచున్న జనాల్లోనుండి ఒక రాయి పడింది , ఆ రాయి తగిలి జగన్ కంటి పైన, నుదురు దగ్గర గాయం అయింది . ఆ దాడి జరిగిన 15 నిమిషాలకే వైసీపీ కార్యకర్తల చేతిలో ప్ల కార్డులు ప్రత్యక్ష మయ్యాయి, చంద్రబాబు డౌన్ డౌన్ అని. వెంటనే పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టేసి, ఇదంతా చంద్రబాబు పనే అని చెప్పేసాడు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ తో , సీఎం పై జరిగిన ఈ దాడి ఘటనను ఖండించారు. కానీ ఎప్పుడైతే, వైసీపీ నాయకులు ఈ సంఘటన టీడీపీ ,చంద్రబాబు మీద వేసారో, అప్పటినుండి టీడీపీ నుండి కౌంటర్ ఎటాక్ స్టార్ట్ అయ్యింది.

ఈ సంఘటన పై అనేక సందేహాలు

కొన్ని రోజుల క్రితం, జగన్ ఒక పబ్లిక్ మీటింగ్ లో సాయంత్రం అయిపోయిన తరువాత, “క్షమించాలి, సాయంత్రం 6 దాటింది, రాంప్ వాక్ చెయ్యడానికి సెక్యూరిటీ ప్రాబ్లమ్ వుంది,అందుకే చెయ్యడటం లేదు అని చెప్పాడు. “, మరి విజయవాడ లో రాత్రి రోడ్ షో చేసినపుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఆలోచించలేదా ?

సీఎం రోడ్ షో జరిగిన రోజు దాడి జరిగిన ప్రాంతంలో కరెంటు తీసేసారు. ఒక సీఎం రోడ్ షో లో కరెంటు ఎలా తీస్తారు, అని అన్ని పక్షాలూ ప్రశ్నిస్తే, దానికి పోలీస్ లు సమాధానం ఇస్తూ, సీఎం వెహికల్ వెళ్లే దారి పొడుగునా, అనేక కరెంటు వైర్ లు ఉండచ్చు, అందుకనే కరెంటు తీసేసాము అని సమాధానం చెబుతున్నారు. కానీ, సీఎం వెహికిల్ మీద జెనరేటర్ ఉంటుంది కదా, దాని ఫ్లడ్ లైట్ లు వెలిగి కూడా లేవు. అవి వెలిగి ఉంటే, ఎదురుగుండా జరిగేవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కదా. అలా ఎందుకు చేయలేదు ?

ఒక వీడియో లో చూస్తే, , గజ మాల వేసేటప్పుడు, అందులో వాడిన సన్న తీగ, లేదా సన్నటి కర్ర గుచ్చుకుని, కంటి పైన నుదురుకు గాయం అయినట్టు, తెలుస్తోంది. అది రాయి తగలక ముందా తరువాత అనేది తెలియడం లేదు.

రాయి సీఎం కు తగిలిన తరువాత, అదే రాయి, పక్కనే వున్న ,వైసీపీ నాయకుడు వెల్లంపల్లి కి తగిలి, అయన కంటికి కూడా గాయమై, ఆ రాయి ఎటో పోయిందంటున్నారు. పోలీస్ లు చెప్పిన ప్రకారం, పిడికిట్లో పెట్టె రాయి అంటున్నారు. అంత బరువైన రాయి ,తగిలిన తరువాత అక్కడే లేదా వెహికిల్ క్రింద పడి ఉంటుంది కదా, అది ఎందుకు సేకరించలేదు.

సీఎం సెక్యూరిటీ డ్యూటీ లో 1400 మంది ఆఫీసర్లు వున్నారంటున్నారు. ఇంతమంది ఉండగా, రాయి విసిరి తప్పించుకోవడం సాధ్యమా ? సీఎం కు తగిలేటట్టు రాయి విసరడం చాలా కాస్త సాధ్యం.

అంత పెద్ద గాయం అని చెబుతున్నారు కదా, పోనీ రాయి తగిలిన తరువాత, బస్సు లోపల ప్రధమ చికిత్స చేసి, అక్కడ ప్లాస్టర్ వేసిన తరువాత, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా, మళ్ళా బస్సు ఓపెన్ టాప్ ఎక్కి, మరో రెండు గంటలు పైన రోడ్ షో ఎలా కంటిన్యూ చేసారు.

అన్ని సందేహాలే

14 న తెనాలి సభలో, పవన్ జగన్ మీద జరిగిన ఈ దాడి సంఘటనను చంద్రబాబు పై రుద్దటాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. దాడి నిజంగా జరిగిందో లేదో తెలియకుండా, ఎలా ఖండిస్తాము, నాన్నా పులి కధ లాగ వుంది కాబట్టి నమ్మే స్థితి కూడా లేమని అన్నారు. అదేమిటో జగన్ కు 2019 లో ఎన్నికల ముందు కోడి కత్తి దాడి జరిగినట్టు, దాడులన్నీ, జగన్ కు ఎన్నికల ముందే చిత్రంగా జరుగుతాయని సెటైర్ వేశారు. చంద్రబాబు మీద ఇలాగె రాయి దాడి జరిగితే, ఒక్క పోలీసు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తన మీద కూడా ఎన్నో రాళ్ల దాడి జరిగాయని, తాను సీఎం కాకపోవడం వల్లే మీడియా దాన్ని పట్టించుకోలేదన్నారు.

 

టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు.

2019 లో ఎయిర్ పోర్ట్ లోపల కోడి కత్తి దాడి జరిగితే, అక్కడ ఉండేది కేంద్ర పోలీస్ లు అయినా, అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అని జగన్ అన్నారు . ఇప్పుడు ఈ ప్రభుత్వం లో జగన్ మీద జరిగిన ఈ దాడి , జగన్ ప్రభుత్వం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా, వైసీపీ ,చంద్రబాబు కు ముడిపెడుతున్నారు , వివేకా హత్య చంద్రబాబే చేయించాడన్నారు, కోడి కత్తి దాడి చంద్రబాబు చేయించాడన్నారు, ఇప్పుడు అవి అన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయాయి. ఇప్పుడు ఎవరో రాయి విసిరితే, మళ్ళా ఈ దాడి ని కూడా చంద్రబాబు కు అంటగట్టడానికి వైసీపీ కి సిగ్గు ఉండాలి అని కౌంటర్ ఇచ్చారు.

2020 లో చంద్రబాబు అమరావతి పర్యటిస్తూ ఉంటే, చంద్రబాబు బస్సు మీదకు రాళ్లు విసిరితే, చంద్రబాబు మీద రాళ్ళ దాడి పై, పోలీస్ లకు ఫిర్యాదు చేస్తే కేసు పెట్టలేదు సరి కదా, డీజీపీ మాట్లాడుతూ, ఆ దాడి వ్యక్తుల భావ ప్రకటనా స్వేచ్ఛ అన్నారు.
అదే ఈ రోజు చంద్రబాబు పలాస సభలో మాట్లాడుతూ, సీఎం ఒక రూల్, ప్రతిపక్ష నాయకుడికి ఒక రూలా అని ప్రశించారు.

చివరగా

అసలు ఎన్నికల ముందు బుర్రలో గుజ్జు వున్న , ఏ పార్టీ అయినా, ప్రత్యర్థి పార్టీ అధ్యక్షుడి పై రాళ్ల దాడి చేయిస్తుందా? దాని వల్ల దాడి చేయించే పార్టీ కి ఏమి లాభం. తిరిగి సానుభూతి ప్రత్యర్థి పార్టీ కే వస్తుంది కదా, మరి వైసీపీ నాయకులు ఆ మాత్రం లాజిక్ లేకుండా, ఈ దాడిని టీడీపీ కి ఎలా అంటగడుతున్నారో అర్ధం కావట్లేదు.

 

 

 

 

 

Leave a Comment