నిర్మలా సీతారామన్ ఎందుకు ఎన్నికల్లో పోటీ చెయ్యడంలేదంటే…..

 

భారత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని చెప్పారు. ఎందుకు అని రిపోర్టర్ అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం, ” బీజేపీ నన్ను తమిళనాడు లేదా ఆంధ్ర ప్రదేశ్ నుండి పోటీ చెయ్యాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రతిపాదించారు, కానీ నేను ఆ ప్రతిపాదనను తిరస్కరించాను, నా దగ్గర డబ్బు లేదు, అందుకే పోటీ చెయ్యడం లేదు “

కేంద్ర ఆర్ధిక మంత్రి అయి వుండి , మీకు నిధుల కొరతా అని అడిగితే ,

“నేను భారత దేశ ఆర్ధిక మంత్రినే, నా జీతం, నా సంపాదన, నా పొదుపు ఇవే నావి , అంతే కానీ భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నాకు చెందదు కదా “, అని సరదాగా చెప్పారు.

ఒక్కసారి ఎమ్మెల్యే గా చేస్తేనే, కోట్లు సంపాదించే భారత రాజకీయ వ్యవస్థలో, ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో వున్నా, 2 సార్లు మంత్రిగా చేసినా, అవినీతి మకిలి అంటని, కోట్లు వెనకేసుకోని ,  సాధారణ మధ్యతరగతి జీవితం గడిపే,  ఒక అరుదైన ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, నిర్మల.

మధురై ,తమిళ అయ్యంగార్ల కుటుంబలో పుట్టిన నిర్మల, న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ (ఇంటర్నేషనల్ స్టడీస్) పట్టా పొందారు , అక్కడే చదివిన, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఇప్పటి, రాజకీయ, టీవీ వ్యాఖ్యాత ,పరకాల ప్రభాకర్ తో పరిచయం, ప్రేమకు,తరువాత, 1986 లో పెళ్ళికి దారి తీసింది.

తొలినాళ్లలో ‘ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్’ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పని చేసారు.. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పని చేసారు.. 2003-05 మధ్యకాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పని చేసారు.

రాజకీయ జీవితం .

2010లో బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించారు . 2014 నాటికి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఆరుగురు బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఒకరిగా వున్నారు .

2014 లో , ఆంధ్రప్రదేశ్ లో ఆమె భర్త పరకాల ప్రభాకర్, అప్పటి సీఎం చంద్రబాబు కేబినెట్ సలహాదారు గా వున్న కాలంలో, ఆంధ్ర ప్రదేశ్ కోటా నుండి, టీడీపీ పార్టీ నుండి రాజ్యసభకు ఎంపీ గా ఎన్నికయ్యారు.

2016 లో కర్ణాటక నుండి రాజ్యసభకు ఎంపీ గా ఎన్నికయ్యారు. కొంత కాలం రక్షణ మంత్రిగా పని చేసారు, 2019 నుండి నరేద్ర మోడీ కాబినెట్ లో ఆర్ధిక మంత్రిగా పని చేస్తున్నారు.

మొత్తానికి నిర్మల సుదీర్ఘ రాజకీయ జీవితంలో, ఎటువంటి వివాదాస్పద సంఘటనలు సంభవించలేదు, ఆమెకు ఎటువంటి అవినీతి మకిలీ అంటుకోలేదు.

వ్యక్తిగత జీవితం చూస్తే , అభిప్రాయం విభదాలతో, తన భర్త నుండి కొంతకాలం నుండి దూరంగా వుంటున్నారన్న వార్తలు వచ్చాయి.

1 thought on “నిర్మలా సీతారామన్ ఎందుకు ఎన్నికల్లో పోటీ చెయ్యడంలేదంటే…..”

Leave a Comment