బెంగళూరు నీటి సంక్షోభం
బెంగళూరు నగరం కొద్ది రోజులుగా తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడుతోంది. తాగునీరు, దొరకడం కష్టం గా మారుతోంది. వేసవి కాలం మొదలయినప్పటినుండి, నీటి కొరత మొదలయ్యింది.
IT ఉద్యోగులు కూడా రోడ్ల మీద వాటర్ కాన్లతో క్యూలలో దర్శనమిస్తున్నారు.
వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరగడంతో ట్యాంకర్ రేటు సాధారణ రేటుకు రెండింతలు పెరిగింది . చాలా అపార్ట్ మెంట్లకు, డిమాండ్ చేసిన మేరకు డబ్బు ఇచ్చినా , రోజూ వాటర్ ట్యాంక్ లు రావడం గగనంగా మారింది, రోజు విడిచి రోజు మాత్రమే ట్యాంకర్లు వస్తున్నాయి. దీనితో అపార్ట్ మెంట్ యజమానులు, అపార్ట్ మెంట్ లో నీటి వాడకం పై పరిమితులతో కూడిన నిబంధనలు విధించారు, వృధాగా పోయే నీటి మీద కూడా దృష్టిపెట్టారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా కూడా విధిస్తున్నారు.
నగరంలో నీటిని నిల్వ చేసే ప్లాస్టిక్ డ్రమ్ముల కొనుగోలు విపరీతంగా పెరిగింది. చాలా అపార్ట్ మెంట్లలో, రోజుకు ఒక్క సారే నీరు వదలడం వలన, ఈ డ్రమ్ములలో అవసరానికి మించి మరీ నీరు నిల్వ చేయడం వలన కూడా , నీటి కొరతకు కారణం అవుతోందని అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు చెబుతున్నారు.
వున్న పరిమితి నీరునే సమర్ధవంతంగా ఎలా వాడుకోవచ్చో , కొంతమంది సోషల్ మీడియా లో పోస్ట్ లు కూడా పెడుతున్నారు. వాటర్ ప్యూరిఫైర్లు ఆన్ అయినపుడు , వృధాగా సింక్ లోకి పోయే నీరును, బకెట్లలో పట్టి, మిగతా అవసరాలు వాడుకోవచ్చని, షవర్ స్నానం ఆపేయమని, వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతికిన తరువాత, బయటకు పోయే నీరును కూడా బకెట్ లలో పట్టి, వాష్ రూమ్ లో ,టాయిలెట్ ఫ్లష్ కు వాడచ్చని సూచిస్తున్నారు.
బెంగళూరు వాటర్ సప్లై బోర్డు కూడా, నీటి వాడకం పై నిబంధనలు విధించారు. స్విమ్మింగ్ పూల్ లకు ,వాహనాలు కడగటానికి , అలాగే చెట్లకు నీరు పోయడం, వీటన్నిటిని రద్దు చేసారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తున్నారు.
22 గృహాలకు జరిమానా
కొద్ది రోజుల క్రితమే, 22 గృహాలు నిబంధనలు అతిక్రమించి కార్లు కడగటం, తోటపనులకు అనవసరంగా నీటిని వాడటం, గుర్తించిన బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (BWSSB) , ఆ గృహాలకు ,కుటుంబానికి 5,0000 చొప్పున జరిమానా విధించింది. భవిష్యత్తులో, ఈ తప్పు పునరావృతం అయితే , జరిమానా మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. 22 గృహాల నుండి రూ. 1.1 లక్షల జరిమానా వసూలు చేసింది, BWSSB. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జరిమానాల వసూలు చేయగా, సౌత్ బెంగళూరు నుండి అత్యధికంగా రూ.80 వేలు వచ్చాయి.
బల్క్ వినియోగదారులకు నీటి సరఫరాలో 20 శాతం కోత విధిస్తున్నట్టు BWSSB తెలిపింది. BWSSB ప్రకారం,
బల్క్ యూజర్లు రోజుకు రెండు కోట్ల లీటర్లు వాడుతున్నారు.
ఏ ఏ ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్నాయి ?
బెంగుళూరు నగర శివార్లలో ఎక్కువగా నీటి కొరత సంక్షోభంవుంది. నగర శివార్లలో. తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాలు:
Bengaluru South Zone: HSR Layout, Bommanahalli, Hoskerehalli, Chickpet, and Yelachenahalli.
Bengaluru West Zone: Rajajinagar 6th Block, Peenya, Bagalagunte, and Bapujinagar.
Bengaluru East Zone: KR Puram, Ramamurthy Nagar, and Marathahalli.
Bengaluru North: Devara Jeevana Halli and Vyalikaval.