ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న దిల్లీ ముఖ్య మం త్రి అరవింద్ కేజ్రీవాల్ ను 21 మర్చి న ED అరెస్ట్ చేసింది. పదవిలో ఉండగా అరెస్ట్ అయిన , తొలి సీఎ గా కేజ్రీవాల్ అయ్యారు. పదవి పూర్తి అయ్యాక, ఆరోపించిన నేరాల్లో దోషిగా తేలి , జైలు కు వెళ్లిన సీఎం లు ఎవరైనా ఉన్నారా ? వివరాలు ఇవిగో.
జయలలిత: 1991-2016 మధ్య కాలం లో తమిళనాడు సీఎం గా పని చేసిన, జయలలిత, కలర్ టీవీల కొనుగోళ్ల వ్యవహారం లో అవకతవకలకు సంబంధిం చిన కేసులో డిసెంబరు 7, 1996లో అరెస్టయ్యా రు. అప్పుడు నెల రోజుల పాటు జైలులో ఉన్నా రు. అలాగే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014లో బెంగళూరు లోని ప్రత్యేక న్యా యస్థానం ఆమెను దోషిగా తేలుస్తూ , 4 ఏళ్ళ జైలు శిక్ష తీర్పు వెల్లడించడంతో, ఆమె సీఎం పదవికి అనర్హత కు గురి అయ్యారు, పదవిలో ఉండగా, అనర్హత వేటుకు గురి అయిన మొదటి సీఎం అయ్యారు. అక్టోబర్ 2014న, సుప్రీంకోర్టు ఆమె శిక్షను తాత్కాలికంగా నిలిపివేసి, ఆమెకు రెండు నెలల బెయిల్ మంజూరు చేసింది . బెంగళూరు జైలులో 21 రోజులు గడిపిన తర్వాత 2014 అక్టోబర్ 18న జయలలిత చెన్నైకి తిరిగి వచ్చారు.
లాలూ ప్రసాద్ యాదవ్ : 1990-1997 మధ్య కాలం లో బిహార్ ముఖ్యమ త్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ ను దాణా కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూతోపాటు మాజీ సీఎం జగన్నా థ్ మిశ్రాలను జార్ఖండ్‌లోని రాంచీలో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయస్థానం 2013లో న్యాయస్థానం దోషిగా తేల్చింది, 6 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. . అనంతరం జైలుకు వెళ్లిన ఆయన ఎంపీ పదవికి 6 సంవత్సరాలు అనర్హతకు గురి అయ్యారు. ..తరువాత బెయిల్ పై బయటకు వచ్చా రు.
ఓం ప్రకాశ్ చౌతాలా: 1 989-2005 మధ్య హరియాణా ముఖ్య మంత్రిగా పలుసార్లు పని చేసిన ఓం ప్రకాశ్ చౌతాలా ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో 2013లో ఆయన దోషిగా తేలడం తో ఢిల్లీ లోని కోర్ట్ ఆయనకు పదేళ్ల శిక్ష విధించింది. . అనంతరం అక్రమాస్తుల కేసులో 2022లో ఢిల్లీ లోని సిబిఐ కోర్టు ఆయనకు మరో నాలుగేళ్లు శిక్ష విధించింది.ప్రస్తుతం అయన ఇంకా జైలు లోనే వున్నారు.
మధు కోడా: 2006-2008 మధ్య ఝార్ఖండ్ సీఎం గా పనిచేసిన మధు కోడా.. మైనింగ్ కేసులో 2009లో అరెస్టయ్యా రు, 2013 లో బెయిల్ మీద బయటకు వచ్చారు, 2017 లో అయన దోషిగా తేలడంతో, ఢిల్లీలోని ప్రత్యేక మనీలాండరింగ్ కోర్టు, మధు కోడాకు 3 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.
హేమంత్ సోరెన్ : 2013-2024 మధ్య కాలంలో ఝార్ఖం డ్ సీఎం గా పనిచేసిన హేమంత్ సోరెన్ .. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను ఎదుర్కొం టున్నా రు. ఆయన ఈఏడాది జనవరి 31న అరెస్టయ్యా రు. అం తకుముం దే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం అయన జైలు లోనే వున్నారు.