ఎలక్టోరల్ బాండ్ల పథకం రద్దు…… సుప్రీంకోర్టు సంచలన తీర్పు

 

ఎలక్టోరల్ బాండ్ల పథకం రద్దు…… సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ, సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 19(1)(ఏ)(Freedom of Speech and Expression)తో పాటు , సమాచార హక్కు చట్టానికి(Right to Information Act)కు ఇవి విఘాతం కల్గిస్తున్నాయని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారి తీస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వీటిని తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. ఈ తీర్పునిచ్చింది. ఇది కచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది.

ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటి?

ఇవి బ్యాంకు డిమాండ్ డ్రాఫ్టుల వంటివి. వీటిని కేంద్ర ఆర్ధిక మంత్రి 2017-2018 బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఏ కింద రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు సేకరించే వెసులుబాటు ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి, ఎంపిక చేసిన SBI బ్రాంచ్ కు మాత్రమే వెళ్లి, రాజకీయ పార్టీ కి ఎంత మొత్తం విరాళంగా ఇవ్వదలుచుకున్నారో, అంత మొత్తం చెల్లిస్తే, అంత విలువ గల, ఎలక్టోరల్ బాండ్(డిమాండ్ డ్రాఫ్ట్ లాంటిది ) బ్యాంకు ఇస్తుంది. ఈ బాండ్లు వెయ్యి, పది వేలు, లక్ష, పది లక్షలు, కోటి రూపాయల డినామినేషన్స్ లో కొనుగోలు చేయవచ్చు. ఆ బాండ్ తీసుకున్న వ్యక్తి వివరాలు, బ్యాంకు గోప్యంగా ఉంచుతుంది. ఈ బాండ్ల పై బ్యాంకు ఎలాంటి వడ్డీ చెల్లించదు. 15 రోజుల్లోగా మాత్రమే ఆ బాండ్ ను, ఆ వ్యక్తి రాజకీయ పార్టీ కి అందించాల్సి వుంది. ఆ రాజకీయ పార్టీ, SBI కు వెళ్లి, ఆ బాండ్ ను సమర్పించి, తమ ఖాతా లోకి, దాని విలువకు సరిపడా నగదు ,తమ ఖాతా లోకి జమ అయ్యేలా చేసుకోవచ్చు. పార్టీ తరుపున రిజిస్టర్ అయి వున్న అకౌంట్ లలోకి మాత్రమే నగదు జమ చేసుకోవాలి. ఈ అకౌంట్ వివరాలను, తమకు వచ్చిన విరాళాల మొత్తాన్ని, ఎలక్షన్ కమిషన్ కు ప్రతి సంవత్సరం సమర్పించాలి, అయితే, విరాళం ఇచ్చిన దాత వివరాలు చెప్పనక్కరలేద్దు.

ఈ బాండ్లతో వచ్చిన చిక్కులేమిటి ?

ఈ బాండ్లు కొనే వ్యక్తి వివరాలు, అధికార పార్టీ కి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. వీటి వల్ల సమాచారం అందరికీ రహస్యం కాదు… ప్రభుత్వంలో ఉన్న వారికి మాత్రం తెలిసిపోతుంది. అందుచేత తమకు మాత్రమే విరాళాలు వచ్చి ఇతర పార్టీలకు విరాళాలు రాకుండా చేసి, ఆ పార్టీల ఆదాయ వనరులకు అడ్డుకట్ట వేసే అవకాశం, అధికార పార్టీ కి ఉంటుంది. అలాగే ఈ బాండ్లు కొన్న వ్యక్తి ఆ మొత్తం ఎలా సంపాదించారు అన్న వివరాలు కూడా చెప్పనక్కరలేద్దు. దీనితో, ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలకు, వ్యక్తులకు మేలు చేసేలా నిర్ణయాలు చేసి, క్విడ్ ప్రో ద్వారా తమ పార్టీలకు వారి ద్వారా ఎలెక్టోరల్ బాండ్ల రూపంలో,కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలు విరాళాలు తీసుకుంటున్నాయి అన్న ఆరోపణలు, ఆ సంఘటనలు కూడా వున్నాయి. అలాగే ఈ బాండ్లకు చెల్లించిన ధనం . నిజాయితీగా సంపాదించారా అన్న సంగతి కూడా చెప్పాల్సిన పని లేదు. పోనీ పన్నులైనా కట్టారా , అది కూడా చెప్పాల్సిన పని లేదు. వీటి వల్ల సమాచారం అందరికీ రహస్యం కాదు… ప్రభుత్వంలో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది.

ఈ బాండ్లు స్కీం ప్రవేశపెట్టిన తరువాత, దేశంలో, అన్ని రాజకీయ పార్టీల కంటే, బీజేపీకే , ఎక్కువ మొత్తంలో ఎలెక్టోరల్ బాండ్లు రావడం గమనార్హం. 2022-23లో ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ రూ.1300 కోట్ల నిధిని సమకూర్చుకోగలిగింది 2022 23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.2120కోట్లు కాగా, అందులో 61 శాతం ఎలెక్టోరల్ బాండ్ల ద్వారానే వచ్చాయి.

గత సంవత్సరం సెప్టెంబర్ లో చంద్రబాబు ను స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినపుడు, చంద్రబాబుకు గాని, అయన కుటుంబ సభ్యులకు గాని, ఈ స్కీం ద్వారా, ముడుపులు ముట్టి, నగదు జమ అయి, చంద్రబాబు అంతిమంగా లబ్ది పొందినట్టు, CID వారు సరి అయిన ప్రాధమిక ఆధారాలుచూపించలేక, టీడీపీ పార్టీ ఖాతా లోకి ఎలెక్టోరల్ బాండ్ల రూపం లో వచ్చిన విరాళాలు అయిన 27 కోట్లు మాత్రమే కోర్ట్ కు చూపించారని, టీడీపీ ఎద్దేవా చేసింది. ఆ 27 కోట్ల వివరాలను తాము EC కి ఎప్పుడో సమర్పించామని అప్పుడు టీడీపీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది.

ఈ ఎలెక్టోరల్ బాండ్లు చట్ట విరుద్ధమని, వీటిని రద్దు చెయ్యాలని, కాంగ్రెస్ నాయకులు జయ ఠాకూర్‌తో పాటు సీపీఐ(ఎం), ఎన్‌జీవో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దాఖలు చేసిన నాలుగు వేర్వేరు పిటిషన్లపై గతేడాది అక్టోబర్ 31న సుప్రీంకోర్టులో వాదనలు మొదలయ్యాయి. ఈ కేసు విచారణ ఇదివరకే పూర్తయినప్పటికీ తీర్పును రిజర్వ్ చేస్తూ నవంబర్ 2న కోర్ట్ నిర్ణయం తీసుకుంది.

ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడిస్తూ, 2018లో తీసుకొచ్చిన ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది.

నల్లధనాన్ని రూపుమాపడానికి ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎలక్టోరల్ బాండ్లు విక్రయించరాదని కోర్టు తీర్పునిచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా క్విడ్ ప్రోకో‌కు అవకాశం ఉందని, పౌరుల సమాచార హక్కును ఈ స్కీమ్ ఉల్లంఘిస్తోందని వివరించింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించిన విరాళాలు, పార్టీల వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్‌ ఒక్కటే మార్గం కాదని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారి తీస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వీటిని తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. ఈ తీర్పునిచ్చింది. ఇది కచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది.

రాజకీయ పార్టీలకు ఆర్థిక సహాయం రెండు విధాలుగా ఉండొచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఒక పార్టీకి మద్దతుగా అందించే విరాళాలు క్విడ్ ప్రోకోకు దారితీసే అవకాశం ఉందని కోర్ట్ అభిప్రాయపడింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎలక్టోరల్ బాండ్ల పథకం ఒక్కటే మార్గంకాదని, ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది

2017-18 ఆర్థిక సంవత్స రం నుంచి ఈ పథకం అమల్లో వుంది.  ఇప్పటివరకు 30 విడతల్లో దాదాపు 28వేల ఎన్ని కల బాం డ్లను SBI విక్రయిం చింది. వీటి మొత్తం విలువ రూ.16,518 కోట్లుగా ఉన్నట్లు ఇటీవల ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో, కేం ద్రమం త్రి పంకజ్ చౌదరి లోక్ సభ కు ఇచ్చి న లిఖిత పూర్వ క సమాధానం లో వెల్లడిం చారు.

సుప్రీం కోర్టు తన తీర్పు లో, 2017-18 నుం చి 2022-23 వరకు ఈ ఎలెక్టోరల్ బాం డ్ల ద్వా రా ఏయే రాజకీయ పార్టీకి ఎం త విరాళం
దక్కిం దన్న వివరాలను పేర్కొం ది. దాని ప్రకారం..

 

 పార్టీ పేరు ఎలెక్టోరల్ బాండ్స్,
రూ . కోట్లలో
BJP 6,565
Congress 1122
Trinamool Congress 1093
Biju Janata Dal 773
DMK 617
YCP 382.44
BRS 383
TDP 146

.

Leave a Comment