దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ 281 పరుగుల భారీ తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌ను స్కోరు ను 179/4 వద్ద కివీస్ డిక్లేర్ చేసి, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 349 పరుగులతో కలిపి మొత్తం 529 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. నాలుగో రోజు ఛేదనలో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు కుప్పకూలింది. .రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానానికి ఎగబాకగా.. భారత్ మూడో ర్యాంక్‌కు పడిపోయింది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది.