సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి….కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి బుధవారం పరిశీలించారు. రూ. 750 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది జరుగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు జరుగుతున్నాయి. మల్టీ లెవల్ పార్కింగ్, విశ్రాంతి గదులు, రూఫ్ టాప్ రైల్వే ట్రాప్ ప్లాట్ ఫారమ్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

చాలా తక్కువ సమయంలో వేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయన్నారు. ఎయిర్ పోర్ట్ తరహాలో కొత్త స్టేషన్ రూపుదిద్దుకుంటుందని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేస్తున్నారన్నారు. 2025 నవంబర్ నాటికి పూర్తి అవుతుందన్నారు. చర్లపల్లి టెర్మినల్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, అది కూడా త్వరలోనే పూర్తి అవుతుందన్నారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామన్నారు. రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే ఆ ప్రాంతాల దగ్గర కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు

Leave a Comment