Responsive Menu
Add more content here...

శాంతి స్వరూప్……చిన్నప్పటి దూరదర్శన్ జ్ఞాపకం

 

 

 

శాంతి స్వరూప్ గారి పేరు వినగానే, చిన్నప్పటి దూరదర్శన్ స్మృతులు ఇప్పటి పెద్దలందరికీ గుర్తుకు వస్తాయి. ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు వార్తలు చదివిన, తెలుగులో మొదటి న్యూస్ రీడర్ , వ్యాఖ్యాత శాంతి స్వరూప్. ఒకరకంగా , ఇప్పటి న్యూస్ రీడర్లకు గాడ్ ఫాదర్ వంటి వ్యక్తి, శాంతి స్వరూప్. వార్తలు చదవడంలో ఆయనది విలక్షణ శైలి.

ఏప్రిల్ 5 న కన్నుమూసిన శాంతి స్వరూప్ గారి గురించి కొన్ని విశేషాలు.

తెలుగు భాష పై ఆయనకు చాలా పట్టు వుంది. తెలుగు భాష రాత, ఉచ్ఛారణలో దిగ్గజం లాంటి ఎన్టీఆర్ చేతే ప్రశంసలు పొందిన న్యూస్ రీడర్ శాంతి స్వరూప్. ఆయనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు, ఎన్టీఆర్ సీఎం అయిన తరువాత, దూరదర్శన్ స్టూడియో కు వచ్చి, ఎన్టీఆర్ ఇవ్వవలిసిన స్పీచ్ ఆయనే రాసుకుంటూ ఉండగా, ఒక వాక్యం లో సరి అయిన పదం స్ఫురించిక ఆగిపోతే, పక్కనే కూర్చున్న శాంతి స్వరూప్ , ఆ పదం ఎన్టీఆర్ కు చెప్పారు, ఎన్టీఆర్ ఆయన్ని ప్రశంసించారు. .

వార్తా ఛానళ్లలో ఇప్పటి న్యూస్ రీడర్లకు టెలీప్రాంప్టర్ ఉంటోంది, చదవవలిసిన న్యూస్ ఎదురుగుండా స్క్రీన్ మీద అక్షరం అక్షరం స్క్రోల్ అవుతూ ఉంటుంది. అది చూసి చదివేయడమే. శాంతి స్వరూప్ పని చేసిన కాలం లో దూరదర్శన్ లో, టెలీప్రాంప్టర్ లేదు. దీం తో స్క్రి ప్ట్ పేపర్లను ఆయన ముందుగానే చూసి, గుర్తుంచుకుని, వార్తలు చదివే వారు. వార్తలు ప్రారంభమైన పదేళ్లపాటు ఇదే పరిస్థితి. ఆయనెక్క డ తప్పు లు చదువుతారో అని అక్క డున్న వారంతా భయపడేవారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక సందర్భం లో వెల్లడిం చారు.

ఇప్పుడు మొబైల్ ఫోన్లలో, సెకండ్ సెకండ్ కి వార్తలు వచ్చేస్తుంటాయి. కానీ 40 ఏళ్ళ క క్రితం పరిస్థితి వేరు. వార్తలు చూడాలంటే దూరదర్శన్ ఒకటే దిక్కు. సాయంత్రం 7 కాగానే, శాంతి స్వరూప్ గొంతు నుండి వచ్చే న్యూస్ కోసం అందరూ టీవీ లకు అతుక్కుపోయేవారు, 7 గంటలవగానే, న్యూస్ మొదలయ్యే ముందు వచ్చే మ్యూజిక్ విని అందరు టీవీల దగ్గరకు దగ్గరకు వచ్చేసేవారు.

రాష్ట్రీయ, జాతీయ ,అంతర్జాతీయ వార్తలు సేకరణ, ఎడిటింగ్ బాధ్యతలు తెర వెనుక బృందం చేసినా,   ఆ బృందం పడిన శ్రమ జనంలోకి సరిగా చేరాలన్నా , ఫలించాలన్నా, న్యూస్‌ ప్రజెంటరే కీలకం. శాంతిస్వరూప్‌ అక్కడే సక్సెస్‌ అయ్యారు. న్యూస్ బృందం ఇచ్చిన వార్తలను  శాంతిస్వరూప్‌ తనదైన శైలిలో ప్రజెంట్‌ చేసేవారు.ఆయన ద్వారా వారి కష్టం ఫలించేది. వార్తలు చదివేటప్పుడు,  స్పష్టంగా చదవడం, పదాల విరుపు అయన ప్రత్యేకత.

అయితే, అప్పట్లో ఆయన పట్ల చిన్న పాటి విమర్శ ఉండేది, విషాదకర వార్తలను, సంతోషకర వార్తలను ఒకే హావభావాలతో చదువుతారనే విమర్స ఉండేది. అప్పట్లో కొంత మంది హాస్య నటులు అయన మేనరిజాన్ని అనుకరించి, ప్రేక్షకులను కొన్ని సినిమాల్లో నవ్వించారు కూడా. క్రికెట్ గురించి వార్తలు చదివేటప్పుడు మాత్రం ఆయన పెదవులు కొద్దిగా నవ్వుతో విచ్చుకునేవి. అయన క్రికెట్ ప్రేమికుడు కావటంవల్లనేమో. 

మీరు చదివిన విషాద వార్తలు ఏమిటి అని అడిగితే, అయన చెప్పినది.

‘‘ఇందిరాగాంధీ హత్య వార్త. ఆవిడ ఉదయం చనిపోతే సాయంత్రం వరకు ఆ వార్త వెల్లడించలేదు.

“ఆవిడ పార్దీవదేహాన్ని తెరపై చూపిస్తుంటే వెనకాల నా వ్యాఖ్యానం వినిపించేది. అలాగే రాజీవ్ గాంధీ మరణవార్త కూడా నేను ఎప్ప టికీ మర్చిపోలేను. ఇవే నా సర్వీ సులో నేను చదివిన విషాద వార్తలు’’ అని చెప్పా రు.

మీరు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి అని అడిగితే,

అప్పట్లో కేంద్ర దూరదర్శన్ నుండి, పది పేజీల న్యూస్ రిపోర్టు ఇంగ్లీషులో  ప్రతిరోజూ హైదరాబాద్ దూరదర్శన్ కు వచ్చేది. దాన్ని అనువదించి, రికార్డు చేసి ప్రసారం చేసే బాధ్యతను తనకే అప్పగించేవారు ఆ పని చేయాలం టే కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే చాలా సార్లు తగిన సమయం లేకపోవడంతో, ఆ రిపోర్టును తెలుగులోకి అనువదించకుండా ముందుగానే ఇంగ్లీషు లోనే చదివి, అర్థం చేసుకుని స్క్రీన్ ముందుకు వచ్చి,లైవ్ లోనే న్యూస్ చదివేవారు. ఆ పని చేయడం చాలా కష్టతరమైనది, సవాలుతో కూడినది. అయినా, ఆయన ఒక్క తప్పు కూడా జరగకుండా చదవడంతో అధికారులంతా ప్రశంసలు కురిపిం చేవారు.

తెలుగులో, మొదటి సారిగా ఒక సీఎం దూరదర్శన్ స్టూడియో కు వచ్చి లైవ్ స్పీచ్ ఇవ్వడం, తరువాత లైవ్ లో, కాలర్ ప్రశ్నలకుసమాధానం చెప్పడం, ఆ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించడం కూడా శాంతి స్వరూప్ ఘనతే. చంద్రబాబు సీఎం గా వున్నపుడు, “ముఖ్యమంత్రి తో ముఖా ముఖి ” అనే ఈ ప్రోగ్రాం కు, శాంతి స్వరూపే హోస్ట్ గా వ్యవహరించేవారు.

ఇప్పుడు ఎన్ని శాటిలైట్ న్యూస్ ఛానల్స్ వచ్చినా, యూ-ట్యూబ్‌ న్యూస్ చానళ్ళు వచ్చినా, ఇప్పటికీ , ఎప్పటికీ , మంచి ఉచ్చారణ, స్పష్టత కూడిన తెలుగు న్యూస్ రీడింగ్ అంటే గుర్తుకు వచ్చేది శాంతి స్వరూప్ గారే. తెలుగు న్యూస్ రీడింగ్ ఉన్నంత కాలం, చరిత్రలో, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

2 thoughts on “శాంతి స్వరూప్……చిన్నప్పటి దూరదర్శన్ జ్ఞాపకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *