వాలంటీర్లు లేకపోతే, ఫించను ఇవ్వలేరా… ఎందుకీ డ్రామాలు

 

 

వాలంటీర్లను పతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు, ఎలక్షన్ కోడ్ ముగిసేదాకా అంటే, జూన్ దాక, ఇవ్వద్దని ఎలక్షన్ కమిషన్ ఆదేశించాక, ఆంధ్రప్రదేశ్ లో పెద్ద రగడ జరుగుతోంది. ప్రతి నెలా, ఒకటో తారీఖుకు ఫించను ఇంటింటికీ ఇవ్వాల్సి వుండగా, ఏప్రిల్ నెల మాత్రం వాలంటీర్లు లేకపోవడంతో , ప్రతి గ్రామంలో సమీపం లో వున్న వార్డు సచివాలయానికి వచ్చి ఫించను తీసుకోవాలిసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 

అసలు దీని వెనుక వున్న నేపధ్యం ఏమిటి?

2019 లో జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడం కోసమని రూ.5వేల గౌరవ వేతనంతో, 2.5 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. 50 నుంచి 100 కుటుంబాలకు ఒక వాలంటీ నియమించారు.. వీరిని ఎలా నియమించారో, దానికి మార్గదర్శకాలు ఏమిటో తెలియదు. మొదట్లో బాగానే వున్నా, రాను రాను అధికార పార్టీ కే వత్తాసు పలికే లా ఈ వ్యవస్థ తయారయ్యింది. విజయసాయి రెడ్డి ,చాలా మంది వైసీపీ మంత్రులు, వాలంటీర్లు 90% మంది వైసీపీ కార్యకర్తలే అని బహిరంగంగా వ్యాఖ్యానించడంతో, ఆ వాలంటీర్ల అధికార పార్టీ కే పని చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించడం మొదలు పెట్టాయి.

జడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు, ఈ వాలంటీర్లు వైసీపీ ఎమ్మెల్యేల ఆదేశంతో, ప్రతి ఇంటికి వెళ్లి, వైసీపీ ని గెలిపించుకుంటేనే మీకు పథకాలు అందుతాయి, వైసీపీ పార్టీ కి వోట్ వెయ్యకపోతే, పథకాలు అందవని బెదిరించే దృశ్యాలు , చాలా ఛానల్స్ ప్రసారం చేసాయి. అంతే కాదు, వీరు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తూ, ప్రభుతం వ్యతిరేక, ప్రతిపక్ష పార్టీ అనుకూలురు ఎవ్వరు అని గుర్తించి, ఆ సమాచారం పై అధికారులకు చేరవేయడంతో, టీడీపీ,జనసేన సానుభూతిపరులు ఓట్లు చాలా తొలగించారని, ఎన్నికల కమిషన్ కు టీడీపీ,జనసేన,బీజేపీ పార్టీలు ఫిర్యాదు చేసాయి, సాక్షాత్తు, టీడీపీ అధినేత చంద్రబాబే ఢిల్లీ వెళ్లి, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఈ ఓట్ల తొలగింపు పై ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.

అయితే ఇప్పుడు 2024 అసెంబ్లీ, ఎన్నికలకు, గెలుపుకోసం ప్రతిపక్షాలు చావో రేవో అని పోరాడుతున్న వేళ, ఈ వాలంటీర్లు, ప్రతి ఇంటికి వెళ్లి, మళ్ళీ జగన్ వస్తేనే ఈ పథకాలు వస్తాయి, టీడీపీ వస్తే ఈ పథకాలు రద్దు చేస్తారని, వైసీపీ పార్టీకే వోట్ వెయ్యాలని బహిరంగంగా ప్రచారం చెయ్యడంతో, రగిలిన ప్రతిపక్ష పార్టీ లు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసాయి. ఈ వాలంటీర్లకు, ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1500 కోట్లు ప్రజలు డబ్బే జీతం గా ఇస్తోందని, వారు ఒక రకంగా ప్రభుత్వం ఉద్యోగులు కావున, ఒక పార్టీ కే ఎలా ప్రచారం చేస్తారని, EC కి ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నాయి.

రిటైర్డ్ ఐఏఎస్ లు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధ్యక్షుడిగా, ఎల్.వి .సుబ్రహమణ్యం మొదలైన వారు సభ్యులుగా వున్న , సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ హై కోర్ట్ లో ఒక పిటిషన్ వేసింది, ఎలక్షన్ కోడ్ వచ్చాక, ఇంటింటికీ వెళ్లే ఈ వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్న కారణాన, కావున, ఈ వాలంటీర్ల చేత ఇంటింటికీ వెళ్లి ఫించన్లు అందచేసే కార్యక్రమాన్ని ఆపించాలని కోరింది. హై కోర్ట్ వారికి అనుకూలంగా తీర్పు ఇస్తూ, దానికి తగ్గ చర్యలు తీసుకోవాలని ,ఆంధ్ర ప్రదేశ్ ఎలెక్షన్ కమిషన్ ను ఆదేశిస్తూ, హై కోర్ట్ తీర్పు చెప్పింది. దానికి తగ్గట్టుగానే, ఎన్నికల కమిషన్ , ఆంధ్ర ప్రదేశ్, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కి లేఖ రాసి, “వాలంటీర్లు బదులు ,ఇంటింటికి ఫించను అందించడానికి ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చూడాలని, ఎలక్షన్ కోడ్ ముగిసేదాకా వాలంటీర్లను విధుల్లోనుండి తప్పించాలని, వారి దగ్గరున్న ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని, మార్చ్ 30 న, ఆదేశించింది. టీడీపీ నాయకులు కూడా చీఫ్ సెక్రటరీ ని కలిసి వాలంటీర్లు బదులు ప్రతి గ్రామ వార్డ్ సచివాలయాల్లో వున్న , 1.5 లక్షలు వున్న ,ఉద్యోగులను ఇంటింటికీ వెళ్లి ఫించను ఇవ్వడానికి పురమాయించాలని , అప్పుడు ఒక్కో సచివాలయ ఉద్యోగి, 49 ఇళ్లకు వెళ్లి అందించవచ్చని ,దానివల్ల ఈ కార్యక్రమం 2 రోజుల్లో పూర్తి అవుతుందని సూచన లిచ్చారు. అసలు ప్రభుత్వం ఖజానా లో సరిపడిన నిధులు ఉన్నాయా అని టీడీపీ నాయకులు అడిగితే, ఉన్నాయని CS బదులిచ్చారు.

అసలు కద ఇప్పుడే మొదలయ్యింది.

ఎప్పుడైతే, EC, ఇంటింటికీ ఫించన్లు ,వాలంటీర్లు చేత ఇప్పించద్దు అని ఆదేశం ఇచ్చిందో, అప్పటినుండి వైసీపీ నాయకులు ,వారి సోషల్ మీడియా , “చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ ద్వారా కోర్ట్ కు వెళ్లి, ఇంటింటికీ వాలంటీర్లు వెళ్లి వృద్దులకు ఫించన్లు ఇవ్వడాన్ని ఆపించాడని, దీనివల్ల వృద్ధులందరు మండుటెండల్లో సచివాలయాలు వెళ్లి, ఇబ్బదులు పడి ఫించన్లు తీసుకోవాల్సివస్తుంది “, అని ప్రచారం మొదలు పెట్టారు, దానికి తోడు ఏప్రిల్ 1 నుండి, తమ కార్యకర్తల చేత, కొంతమంది వృద్ధులను మంచాల మీద పడుకోబెట్టి, ఫించను తీసుకోడానికి సచివాలయాలకు తీసుకెళ్లేటట్టు చేసి”, ఇదంతా చంద్రబాబు వల్లే అని వారి అనుకూల ఛానళ్లలో ప్రసారం చేసారు. వృద్ధులందరు, దూర ప్రాంతాలనుండి, ఏప్రిల్ 1 నుండి సచివాలయాలుకు వచ్చి సాయంత్రం వరకు నిరీక్షించినా, వారికి ఫించను ఇవ్వలేదు. పైగా వారు కూర్చోడానికి సదుపాయాలు, త్రాగడానికి కనీసం నీరు కూడా ఇవ్వలేదు, ఇలా మొదటి రోజు చాలా మంది వృద్ధులను, సచివాలయాలలో ఇబ్బంది పెట్టారు . మొదటి రోజు కేవలం 20 శాతం మందికి మాత్రమే ఫించను ఇచ్చారు, మిగతా వారిని మరుసటి రోజు రమ్మని తిప్పి పంపించేశారు. ఇదే అదనుగా తీసుకుని, వైసీపీ ఎమ్మెల్యేలు, వాలంటీర్ల తో, ఈ వృద్దులకు ఫోన్ లు చేయించి, తాము ఉంటే మీ ఇంటిదగ్గరకే వచ్చి ఫించను అందించేవాళ్లమని, కానీ మమ్మల్ని తప్పించి, మీకు ఫించను అందకుండా   .చంద్రబాబు,పవన్,బీజేపీ చేస్తున్నారని, ఒక రెండు నెలకు ఆగితే, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడని, అప్పుడు మరలా మేము మీ ఇంటికే వచ్చి అందిస్తామని ” , చెప్పించారు

 

టీడీపీ నాయకుల కౌంటర్

” మార్చ్ 28 సాక్షి పత్రికలో , ఏప్రిల్ నెలలో ఫించన్లు, 3 వ తారీఖు నుండి పంపిణీ చేసే కార్యక్రమం మొదలవుతుందని, దానికి కారణం, ఆర్ధిక సంవత్సరం ముగియడం వల్ల ,బ్యాంకులకు వరుస సెలవులు రావడం వల్ల అని వచ్చిందని, అంటే ఫించను ఆలస్యం అవుతాయని వారికి ముందే తెలుసు, అసలు ప్రభుత్వం ఖజానా లో ఫించన్లు ఇవ్వడానికి డబ్బు లేదని, ఎలక్షన్ కోడ్ వచ్చాక, కావలిసిన కాంట్రాక్టర్లకు, 12,000 కోట్లు బిల్లులు చెల్లించేశారని, దీనివల్ల ఖజానా లో ఫించన్లకు అస్సలు డబ్బు వుంచలేదని, కేవలం 300 కోట్లు మాత్రమే వుంది అని, దాని వల్లే సచివాలయంలో కూడా ఫించను ఇవ్వటం లేదని, అయినా ఎన్నికల కమిషన్ ఆదేశాలలో, ఇంటికి వెళ్లి ఫించను అదించవద్దనే ఆదేశాలు ఎక్కడా లేవని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమనే , EC చెప్పిందని, 1.5 లక్షల మంది వున్న సచివాలయ ఉద్యోగులు చేత ఫించను అందిస్తే, రాష్ట్రము మొత్తం రెండు రోజుల్లో పూర్తి చెయ్యవచ్చని, దీనికి బాధ్యుడు ,చీఫ్ సెక్రటరీ వహించాలని, అయన కావాలనే, సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపించకుండా, వృద్దులు సచివాలయాలకే వచ్చి ఫించను తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారని, టీడీపీ ని దెబ్బ తియ్యడానికి జరుగుతున్న కుట్రలో , CS కు కూడా భాగం ఉందని”, టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు.

టీడీపీ నాయకులు చెప్పిందే నిజమయ్యింది, ఏప్రిల్ 2 వ తారీఖున, ప్రభుత్వం RBI దగ్గర అప్పు తీసుకున్న తరువాతే, బ్యాంకు లో డబ్బులు జమ అయ్యాయి, ఆ డబ్బు సచివాలయాలకు తీసుకొచ్చి , సచివాలయ సిబ్బంది 2 వ తారీఖు నుండి ,అక్కడికి వచ్చిన వృద్దులకు ఫించను అందించడం మొదలు పెట్టారు. 5వ తారీఖు అయినా, ఇంకా ఫించను పంపిణీ కార్యక్రం ముగియలేదు. మరిన్ని రోజులు కావాలనే ఈ అంశాన్ని సాగదీసి ,టీడీపీ మీద నెపం నెట్టెయ్యడానికి కుట్ర చేస్తున్నారని ,టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొదట్లో వైసీపీ కుట్ర ని, చాలా మంది వృద్దులు నమ్మినా , 3 రోజులయినా ఫించను ఇవ్వకపోవడంతో, ఈ ఇబ్బందులు టీడీపీ వల్ల కాదని, , “ఖజానా లో అసలు డబ్బు లేకపోవడమే దీనికి కారణమని చాలా మంది వృద్దులు గ్రహించడం మొదలు పెట్టారు. అయితే, టీడీపీ ని నష్టపరుద్దామని, 65 లక్షల ఫించదారులు ఓట్లు టీడీపీ కి పడకుండా చేద్దామని వైసీపీ చేసిన కుట్ర, బూమరాంగ్ అయి, వారికే తిరిగి చుట్టుకుంది.

అయితే , సచివాలయ ఉద్యోగుల చేత ఇంటింటికీ ఫించను అందించకుండా, తిరిగి వృద్ధ ఫింఛనుదారుల్ని సచివాలయాలకే రప్పించే , వైసీపీ కుట్ర కు సహాయపడుతుంది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అని , ఆయన్ని EC తొలగించాలని , కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరతామని టీడీపీ నాయకులు అంటున్నారు.

వైసీపీ నాయకులు ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమి లేకపోవడంతో పూర్తిగా తమ ప్రచారంలో వాలంటీర్లనే నమ్ముకున్నారు. ఎన్నికల సంఘం వాలంటీర్లపై ఆంక్షలు విధించడంతో చివరికి వాలంటీర్‌గా రాజీనామా చేసి పార్టీ ప్రచారంలో పాల్గొనాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు వైసీపీ నాయకులు. మళ్లీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లుగా మిమల్ని తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. అయితే వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే అంచనాల నేపథ్యంలో.. తాము రాజీనామా చేస్తే తరువాత తమ పరిస్థితి ఏమిటని కొందరు వాలంటీర్లు నిలదీస్తున్నారు. తాము ఏదో ఒకటి చేస్తామని.. ప్రస్తుతం రాజీనామా చేయాలని ఒత్తిడి పెడుతున్నారు. కొందరు రాజీనామా చేస్తుంటే.. మరికొందరు మాత్రం తమను ఒత్తిడి చేయవద్దని చెబుతున్నారట. ఓడిపోతామనే భయంతో ప్రజాస్వామ్య యుతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను వైసీపీ నేతలు కలుషితం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వైసీపీ స్వార్థ ప్రయోజనాల కోసం

వైసీపీ నాయకుల రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తమను ఎందుకు బలి చేస్తారంటూ కొందరు వాలంటీర్లు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేయమంటే స్థానిక నాయకులు తమను బెదిరిస్తున్నారని కొందరు వాపోతున్నారు. తాము ఇంటర్వ్యూలకు వెళ్లి వాలంటీర్లుగా ఎంపిక అయ్యామని.. పార్టీ నాయకులు ఇప్పించలేదని, ఇప్పుడు మాత్రం రాజీనామా ఎందుకు చేయమంటున్నారని వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల రాజీనామా చేసిన వాలంటీర్లకు పది వేల రూపాయిలను వైసీపీ నాయకులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి ఓడిపోతామనే భయంతో వైసీపీ నాయకులు రోజుకో కుట్రకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.

 

 

 

 

 

 

1 thought on “వాలంటీర్లు లేకపోతే, ఫించను ఇవ్వలేరా… ఎందుకీ డ్రామాలు”

Leave a Comment