రాజ్ కోట్ లో, భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతన్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో, కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సూపర్ సెంచరీలతో, అదరగొట్టారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి, భారత్ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది, జడేజా 110(212), కుల్దీప్ యాదవ్ ఒక్క పరుగుతో క్రీజ్ లో వున్నారు. అరంగేట్ర మ్యాచ్ లోనే రాణించి, 66 బంతుల్లోనే 62 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఆకట్టుకున్నాడు, అరంగేట్ర టెస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ సాధించిన భారత 3వ బ్యాటర్ సర్ఫరాజ్ అయ్యాడు.
టాస్ గెలిచి, బాటింగ్ ఎంచుకుని, బ్యాటింగ్ ప్రారంభించి 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను రోహిత్,జడేజా, సర్ఫరాజ్ అద్భుతంగా రాణించి, ఆదుకోవడంతో , భారత్ మొదటి రోజు 326 పరుగులు చేయగలిగింది.
రోహిత్ కు ఇది టెస్టుల్లో 11 వ సెంచరీ. ఈ క్రమంలో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు, 36 సంవత్సరాల వయసులో, టెస్టుల్లో టీమిండియా తరఫున సెంచరీ చేసిన అత్యధిక వయసు గల కెప్టెన్‌గా నిలిచాడు. మరో రికార్డు కూడా రోహిత్ బ్రేక్ చేసాడు. అత్య ధిక సిక్సర్లు కొట్టిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. 78 సిక్సర్లతో రెండో స్థానం లో ఉన్న ధోనినీ అధిగమించాడు. 91 సిక్స్ లతో సెహ్వా గ్ మొదటి స్థానం లో ఉన్నా డు.
Good informative website..keep it up!👏