రాంచీ టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం..3-1 తో సిరీస్, భారత్ కైవసం భారత్ విజయం
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రాంచీ లో ఇంగ్లాండ్ జరుగుతున్న, 4 టెస్ట్ మ్యాచ్ ను, భారత్ గెలుచుకుని, సిరీస్ ను 3-1 తో గెలుచుకుంది. 192 పరుగుల విజయలక్ష్యం తో బాటింగ్ ప్రారంభించిన, భారత్ ,3 వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక్క వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 4 వ రోజు బాటింగ్ ప్రాంభించిన భారత్, రోహిత్ అర్ధ సెంచరీ తో విజయం సులభంగానే సాధించబోతోంది అన్న తరుణంలో, రోహిత్, జైస్వాల్ ఔట్ తరువాత , వెంట వెంటనే భారత్, రజత్ పటిదర్ , జడేజా, సర్ఫరాజ్ ఖాన్, భారత్ వికెట్లు కోల్పోవడంతో, భారత్ అభిమానుల్లో విజయం సాధిస్తామా లేదా అన్న టెన్షన్ నెలకొంది. అయితే, శుభ్ మన్ గిల్, ధృవ్ జురెల్ , అద్భుత బాటింగ్ ప్రదర్శించి, మరో వికెట్ పడకుండా ఆడి , 192 పరుగుల టార్గెట్ ఛేదించి, భారత్ ను గెలిపించారు. మొదటి ఇన్నింగ్స్ లో 90 పరుగులు చేసి భారత్ ను ఆదుకుని, , రెండవ ఇన్నింగ్స్ లో కూడా , 39 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి, విజయంలో కీలక పాత్ర వహించిన ధృవ్ జురెల్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.