Responsive Menu
Add more content here...

ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీ కేసు లో విస్తుపోయే నిజాలు

 

 

 

 

హీరోయిన్ , మోడల్ అయిన కాదంబరి నత్వాని , హైదరాబాద్ లో వున్నపుడు వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెరిగిన తరువాత, ఈ విద్యాసాగర్ తనను పెళ్లి చేసుకోమని అడిగాడు, అప్పుడు ఆమె, ఇతని గత చరిత్ర తెలుసుకుంది, అప్పటికే అతను డివోర్సీ , అది కాక 2014 లో వైసీపీ తరుపున మైలవరం నుండి పోటీ చేసిన అతని ఎన్నికల అఫిడవిట్ ద్వారా (ఆ ఎన్నికల్లో అతను ఓడిపోయాడు ), అతనికి 14 కేసులున్నట్టు తెలుసుకున్న నత్వాని , అప్పటినుండి, అంటే 2017 నుండి అతన్ని దూరం పెట్టింది. అప్పటినుండి, ఆమెకు, ఈ వైసీపీ విద్యాసాగర్ కు సంభంధం లేదు అని ఆమె చెప్పింది. ఆ తరువాత, ఈ విద్యాసాగర్ తన న్యూడ్ ఫొటోస్ పంపించి, ఆమెను వేధించాడు. ఆ ఫోటో కూడా ఆమె మీడియా కు చూపించింది.

కట్ చేస్తే, ఈ 2024 ఫిబ్రవరి లో ఈ వైసీపీ విద్యాసాగర్, కాదంబరి మీద ఒక కేసు (తప్పుడు) పెట్టాడు(కొంతమంది వైసీపీ పెద్ద నాయకుల ప్రోద్భలంతో ). ఇతనికి ,ఆంధ్ర ప్రదేశ్ లో ఇబ్రహీం పట్టణం దగ్గర వున్న ఒక భూమిని, తన సంతకం ఫోర్జరీ చేసి, ఇద్దరు వ్యక్తులకు అమ్మడానికి 5 లక్షలు తీసుకుని అగ్రిమెంట్ చేసుకుంది అని. మాములుగా అయితే మన పోలీస్ లకు అనుమానం రావాలి, “తెలుగు రాని ఒక హీరోయిన్ , ఎక్కడో ముంబై నుండి ఇక్కడకు వచ్చి, ఎలా భూమి అమ్మడానికి ప్రయత్నిస్తుంది” అని. కానీ, వాళ్లకు రాదు ,ఎందుకంటె, ఈ ఫిర్యాదు ఆధారంగానే కదా, ఆమెను ఎలాగైనా అరెస్ట్ చేసెయ్యడానికి ప్లాన్ చేసింది.
విద్యాసాగర్ ఫిబ్రవరి 2 న ఉదయం ఫిర్యాదు చేస్తే, ప్రాధమిక ఆధారాలు కూడా పరిశీలించకుండా, FIR వెంటనే నమోదు చేసేసి, వెంటనే , లోకల్ కోర్ట్ కు వెళ్లి, సెర్చ్ వారంట్ మాత్రమే (అరెస్ట్ వారంట్ కాదు ), తీసేసుకుని, అదే రోజు ఆఘమేఘాలమీద అంత డబ్బు ఖర్చు పెట్టి, ముంబై విమానం లో వెళ్లిపోయారు. మాములుగా ఒక సాధారణ వ్యక్తి ఫిర్యాదు ఇస్తేనే, కొన్ని రోజుల పాటు పట్టించుకోకుండా తాత్సారం చేసే మన పోలీస్ లు, ఈ కేసులో మాత్రం ఒక్క రోజులోనే చేయాల్సిన తతంగం పూర్తి చేసి, ముంబై విమానం లో వెళ్లిపోయారు.

అదే రోజు, ముంబై లో ఈ హీరోయిన్ నత్వాని ఇంటికి వెళ్లి, ఈ ఫిర్యాదు చూపించి, ఆమెను ,ఆమె తల్లి దండ్రులను అరెస్ట్ చేసి, వాళ్ళ మొబైల్ ఫోన్ లు లాక్కుని ,. లాయర్లకు కూడా కూడా ఫోన్ చేయకుండా చూసారు, వాళ్ళ బ్యాంకు అకౌంట్ లన్నీ ఫ్రీజ్ చేసారు. వెంటనే అక్కడ నుంచి, ఆమె తో సహా ఆమె కుటుంబం మొత్తాన్ని కూడా , ముంబై నుండి రోడ్ మార్గం లో ,విజయవాడ తీసుకొచ్చి, తీసుకొచ్చిన 24 గంటల్లో, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచకుండా, 3 రోజులు ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో అక్రమంగా నిర్బంధించి వేధించారు. ఆ తరువాత 40 రోజులు జైల్లో పెట్టి వేధించారు, బెయిల్ కూడా అప్లై చెయ్యకుండా చేసారు, దారుణం ఏమిటంటే, జైలు లో ఆమె పీరియడ్స్ ,బ్లీడింగ్ అవుతోంది, సానిటరీ పాడ్స్ ఇవ్వండి అన్నా సరే ఇవ్వలేదు. . ఎంత పెద్ద కుట్ర అంటే , వైసీపీ విద్యాసాగర్ ఫిర్యాదు ఇచ్చినది ఫిబ్రవరి 2 అయితే, ఈ IPS లు, ఫిబ్రవరి 1 నే విమానం టికెట్స్ ముంబై కు బుక్ చేసుకున్నారు. వారం రోజుల్లో బెయిల్ వచ్చే, ఈ చిన్న కేసులో, 40 రోజులు బెయిల్ రాకుండా చేసారు, 40 రోజులయ్యాక, బెయిల్ మీద విడుదల అయ్యాక, ఆ కుటుంబం దగ్గర, తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుని, ముంబై వెళ్లిపోవాలని, ఎవ్వరికీ చెప్పద్దు అని బెదిరించారు.

దారుణం ఏమిటంటే, జైలు లో ఆమె పీరియడ్స్ ,బ్లీడింగ్ అవుతోంది, సానిటరీ పాడ్స్ ఇవ్వండి అన్నా సరే ఇవ్వలేదు. . ఎంత పెద్ద కుట్ర అంటే , వైసీపీ విద్యాసాగర్ ఫిర్యాదు ఇచ్చినది ఫిబ్రవరి 2 అయితే, ఈ IPS లు, ఫిబ్రవరి 1 నే విమానం టికెట్స్ ముంబై కు బుక్ చేసుకున్నారు. వారం రోజుల్లో బెయిల్ వచ్చే, ఈ చిన్న కేసులో, 40 రోజులు బెయిల్ రాకుండా చేసారు, 40 రోజులయ్యాక, బెయిల్ మీద విడుదల అయ్యాక, ఆ కుటుంబం దగ్గర, తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుని, ముంబై వెళ్లిపోవాలని, ఎవ్వరికీ చెప్పద్దు అని బెదిరించారు.

ఇక్కడ ఇష్యూ YCP పెద్దలు చెప్పారని, ఆంధ్ర పోలీస్ లు ఫేక్ కేసు పెట్టి, దారుణంగా వేధించడం. ముంబై నుండి , ఆమెనే కాక ఆమె పేరెంట్స్ ను కూడా తీసుకొచ్చి వేధించారు, ఎక్కడో దుబాయ్ లో వున్న ఆమె డాక్టర్ బ్రదర్ ను కూడా కేసు లో ఇరికించారు. ఇది కాక, “ఎవరికైతే, వైసీపీ విద్యాసాగర్ భూమి, ఫోర్జరీ చేసి , నత్వాని అమ్మడానికి ప్రయత్నించింది “, అని విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు చేసాడో, వాళ్ళు “మాకు నత్వాని ఎవ్వరో తెలియదు, మా ఆధార్ కార్డ్స్ ఫోర్జరీ చేసి తీసుకున్నారు, విద్యాసాగర్ భూమి మాకు, ఆమె అమ్మడానికి ప్రయత్నించింది అన్నది తప్పు, అసలు ఆ హీరోయిన్ మా దగ్గరకు రాలేదు “, అని వాంగ్మూలం ఇప్పుడు ఇచ్చారు.

వైసీపీ పెద్దలు చెపితే, ఈ దారుణం చేసిన ముగ్గురు IPS లను సస్పెండ్ చేసారు, విచారణకు ఆదేశించారు. ఫేక్ కేసు పెట్టిన, వైసీపీ విద్యాసాగర్ మీద కూడా ఇప్పుడు FIR నమోదు చేసారు. ఈ IPS లు తదుపరి విచారణలో, వైసీపీ పెద్ద తలకాయలు చెబితేనే చేసాము అని వాగ్మూలం ఇస్తే, ఆ వైసీపీ పెద్దలు కూడా అరెస్ట్ కాక తప్పదు

Leave a Comment