మా అన్న జగన్ కు ఓటేయకండి! — వివేకా కుమార్తె సునీతా రెడ్డి
వై.స్ .వివేకా హత్యోదంతం జరిగి దాదాపు 5 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంలో అయన కుమార్తె, సునీత , ఢిల్లీ లో నిర్వహించిన సంచలన ప్రెస్ మీట్ లో ఆమె పేర్కొన్న అంశాలు ఏమిటి?
“మీడియా ముందుకు రావటానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. వివేకా హత్య కేసు విచారణలో మీ అందరి సహకారం కావాలి. ఏపీ ప్రజల మద్దతు, తీర్పు నాకు అవసరం. సాధారణంగా హత్య కేసు కొద్ధి నెలల్లో తేలుతుంది, కానీ వివేకా హత్య కేసు దర్యాప్తు మాత్రం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంతవారే మోసం చేసి ఓడించారు. నేను నాన్నగారిని హత్య చేసారని తెలిసిన రోజే, పులివెందుల వెళ్ళాను, అక్కడ అవినాష్ నా దగ్గరకు వచ్చి, నిన్న రాత్రి 11.30 వరకూ నా కోసం ఎన్నికల్లో ప్రచారం చేశాడని చెప్పాడు. మార్చురీ వద్ద అవినాశ్ నాతో మాట్లాడారు. సినిమాల్లో చూపించే విధంగా ఒక్కోసారి హంతకులు మనమధ్యే ఉంటున్నా మనకు తెలియనట్లే ఉంటుంది’’
. సొంత వాళ్లను అంత సులువుగా అనుమానించలేం, అందుకే జగన్ ని కలిసినప్పుడు నాకు ఆయనపై అనుమానం రాలేదు. సీబీఐ దర్యాప్తునకు వెళదామని అప్పట్లో జగన్‌ని అడిగా. సీబీఐ దర్యాప్తునకు వెళ్తే అవినాశ్ బీజేపీలోకి వెళ్తారని జగన్ అన్నారు. అయినా సరే.. నేను సీబీఐకి ఫిర్యాదు చేశా. ఆ తర్వాత నాతోపాటు నా భర్తకు వేధింపులు ఎదురయ్యాయి. సీబీఐ పైన కూడా కేసులు పెట్టడం మొదలు పెట్టారు. కేసు విచారణ ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. మా నాన్న హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది. వారిద్దరిని జగన్ రక్షిస్తున్నారు. తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. జగన్ కేసులు అవుతున్న విధంగానే ఈ కేసు డ్రాగ్ అవడం నాకు ఇష్టం లేదు. సీబీఐకి ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో నాకు తెలియదు. జగన్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపారు అని చెప్పారు.. గొడ్డలితో నరికి చంపారు అనే విషయం ఆయనకి ఎలా తెలుసు? ? నాన్న హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరపాలి. ఆధారాలు లేకుండా నేను ఇప్పుడు మాట్లాడలేను, నా దగ్గర వున్న ఆధారాలన్నీ, సిబిఐ కు ఇచ్చాను.
ఈ హత్య కు పాల్పడిన నిందితులకు శిక్ష పడాలని , గత 5 ఏళ్ళనుండి, నేను చేస్తున్న పోరాటానికి , షర్మిల ఒక్కరే నాకు మొదటి నుంచి అండగా నిలిచారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మహాసేన రాజేష్, బీజేపీ ఆదినారాయణ రెడ్డి,జడ శ్రవణ్ కుమార్, ఇంకా ఎంతో మంది పెద్దలు నా పోరాటానికి మద్దత్తు ఇచ్చారు, వారందరికీ నా కృజ్ఞతలు తెలుపుతున్నాను.
మాట్లాడితే, ప్రతి సభలోను, జగన్ నా అక్క చెల్లెమ్మలు అంటారు, విలువలు,విశ్వసనీయత అంటారు, ముందు అయన చెల్లెలుకు న్యాయం చేయమనండి. ఇప్పటికే జైలు లో వున్న నిందితులు బయటకు వస్తే, సాక్ష్యాలు రూపు మాపుతారు, మళ్ళా జగన్ అధికారంలోకి వస్తే, ఆయన ఇన్ఫ్లుయెన్స్ తో, ఈ కేసు ముందుకు నడవదు. అందుకే జగన్ అధికారంలోకి రాకూడదు, జగన్ని ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
ఒక మాజీ సీఎం సోదరుడు హత్య కేసు అదే ఇంకో రాష్ట్రంలో జరిగితే… నేషనల్ మీడియా ఇదే విధంగా స్పందించేదా, నేషనల్ మీడియాలో ఏపీ అంశాలు ఏమైనా వస్తున్నాయా ? ఈ ప్రెస్ మీట్ కు చాలా తక్కువ మంది నేషనల్ మీడియా ప్రతినిధులు వచ్చారంటే, నేషనల్ మీడియా పైన కూడా ఎంత వత్తిడి ఉందొ అర్ధం అవుతోంది. సిబిఐ, పైన బీజేపీ వత్తిడి వుంది అనడానికి నా దగ్గర ఆధారాలు లేవు. ఇది మొదట గుండెపోటు అని చెప్పిన ఎంపీ విజయసాయి రెడ్డి ని సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదు?’’