ఆంధ్ర ప్రదేశ్ లో, జేపీ మద్దత్తు ఎవరికి?

 

2009 లో లోక్ సత్తా సంస్థ అధ్యక్షుడిగా వున్న , రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాశ నారాయణ్ , మొదటి సారిగా, 2009 లో తమ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తోందని , 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో జేపీ స్వయంగా హైదారాబాద్ లోని, ఆంధ్ర ప్రాంత ఓటర్లు అధికంగా వుండే, కూకట్ పల్లి, నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా, శాసనసభకు పోటీ చేసి విజయ సాధించారు. అనేక స్థానాల్లో లోక్ సత్తా పోటీ చేసినా, కేవలం JP ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. . అదే ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి పోటీ చేసారు. జేపీ ఒక్క స్థానం లోనే గెలిచినా, ప్రజారాజ్యం 17 అసెంబ్లీ స్థానాల్లో గెలిచినా, ఈ రెండు పార్టీ ల వలన కాగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక వోట్, చీలిపోవడం వలన తమకు బాగా నష్టం ఎదురయింది, పరాజయం ఎదురయ్యింది అని అప్పుడే కాదు, తరువాత కాలం లో కూడా చాలా సార్లు వాపోయిన పార్టీ ‘టీడీపీ’. రాజకీయ పార్టీగా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినా.. 2009 ఎన్నికల్లో చదువుకున్న వాళ్ల ఓట్లను చీల్చి.. టీడీపీని దెబ్బకొట్టడంలో JP తనదైన పాత్ర పోషించారు. 

2009 – 2014 కాలంలో కూకట్ పల్లి నియోజకవర్గానికి JP చేసింది ఏమి లేదని, అయన మాటలు తప్ప, చేతల్లో ఏమి ఉండదని విమర్శలు చేసినవారు కూడా వున్నారు. 2014 లో తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తరువాత, JP, ఆంధ్ర వారు అధికంగా వుండే, మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుండి ,పోటీ చెయ్యడానికి టీడీపీ టికెట్ ఆశించారు, అయితే టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆ కారణం చేతనే, అప్పటినుండి, ఆయన, ఈ రోజు వరకు టీడీపీ ని పరోక్షంగా విమర్శిస్తూ వుంటారు, టీడీపీ కి మద్దత్తు ఎప్పుడు ఇవ్వరు, అని టీడీపీ వర్గాలు వాపోతూ ఉంటాయి.

వర్తమానానికి వస్తే, లోక్‌సత్తా జేపీ కొంత కాలంగా బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తూ వస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లో, ఓ కార్యక్రమంలో జగన్ తో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. దీన్ని అప్పుడే ఖండించారు. కార్యక్రమంలో పాల్గొన్నాను తప్ప రాజకీయాలపై చర్చించలేదన్నారు. తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో యూట్యూబ్ ఇంటర్యూల్లో జగన్ పై పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యవహారంతో ఆయన నిజాయితీని ప్రశ్నించేలా టీడీపీ అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెట్టి JP ని విమర్శించారు. . అలాంటి JP, టీడీపీ శ్రేణులకు ఊరటనిస్తున్నట్టుగా , అనూహ్యంగా 20 మార్చి న JP నిర్వహించిన ప్రెస్ మీట్ లో, ఈ సారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అయిన , NDA కు తమ లోక్ సత్తా పార్టీ మద్దత్తు ఇస్తుందని ప్రకటించడంతో, టీడీపీ శ్రేణులు ఆనందం లో మునిగిపోయాయి. ఎన్డీఏ కూటమికి మద్దతు పలకడమే కాకుండా.. వైసీపీ రాక్షస పాలనను పిలుపునిస్తున్నారు. ఇది అనూహ్యమైన మార్పుగానే కనిపిస్తోంది.

జేపీ ప్రెస్ మీట్ లో ముఖ్యాంశాలు చూస్తే

NDA కూటమి వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. అరాచకపాలనకు చరమగీతం పాడి.. అభివృద్ధి , సంక్షేమానికి పాటు పడేవారికి మద్దతిస్తున్నానని తెలిపారు. ఇలా మద్దతు ప్రకటించినందుకు తనపైనా కులం ముద్ర వేసి తిట్టే వాళ్లు ఉంటారు అయినా నిజాయితీ రాష్ట్ర భవిష్యత్ కోసమే మద్దతు ప్రకటిస్తున్నానన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు, రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని జయప్రకాశ్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో కులాల గురించి ఎక్కువ ప్రస్తావన జరగడం విచారకరం అని జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. కులాలకు అతీతంగా పనిచేసే నేత లేరని పేర్కొన్నారు. గతంలో చాలామంది నేతలు కుల మతాలకు అతీతంగా సమాజం కోసం పనిచేశారని వివరించారు. కొందరు మూర్ఖులు, అజ్ఞానులుగా మారారని ధ్వజమెత్తారు. తప్పు ఎత్తి చూపితే చాలు కులం, మతం, ప్రాంతం పేరు తెరపైకి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వారు నియంతలా వ్యవహరిస్తున్నారని జేపీ మండిపడ్డారు. మద్దతుగా ఉంటే పూల బాట, ప్రత్యర్థిగా ఉంటే ముళ్ల మార్గంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలదే.. మన డబ్బు మన హక్కు అని వివరించారు.

‘దేశానికి, ప్రజలకు మంచి జరగాలంటే ఆర్థిక ప్రగతి అవసరం. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రగతి మాట లేకుండా పోయింది. ఐదేళ్లలో ఏపీ పేరు దిగజారిపోయింది. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి వచ్చింది. దోపిడీ చేస్తూ.. సంక్షేమ పథకాలు అమలు చేశామని చెబుతున్నారు. ప్రజా పాలన ఇది కాదు అని’ జేపీ ధ్వజమెత్తారు. . సుపరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదన్నారు. అభివృద్ధి చేస్తేనే మంచి పాలన ఇచ్చినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. అప్పులు తీసుకొచ్చి సంక్షేమం కోసం ఖర్చు చేయడం సరికాదని జేపీ సూచించారు. సంక్షేమమే పాలన అనుకుంటే ఆ దేశం, రాష్ట్రం అధోగతి పాలు కావడం ఖాయం అని హెచ్చరించారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించాలని జయప్రకాశ్ నారాయణ సూచించారు. పేదరికం సమూలంగా వెళ్లిపోవాలని, అప్పుడే అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనాలు అని, అభివృద్ధి అంటే దీర్ఘకాలిక సంపద సృష్టించడం అని జయప్రకాశ్ నారాయణ వివరించారు. ఉపాధి కల్పించి, పెట్టుబడులు అందజేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

ఒడిశా కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారిందని జేపీ మండిపడ్డారు. ‘ఒడిశాలో రూ.26 వేల కోట్ల రెవెన్యూ ఉంది. అవసరం మేరకు అప్పులు చేస్తారు. హంగు లేదు.. ఆర్బాటం లేదు. ప్రచారం అంతకన్నా లేదు. ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన సుపరిపాలన అందుతోంది. సంస్కరణలు సాధ్యం కాదు అనేవారు అవినీతి పరులు, అసమర్థులు. వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి రెవెన్యూ పెంచుకోలేక పోయారు. కుల, మతం, హింస రాజ్యమేలిన ఉత్తర ప్రదేశ్ తీరు కూడా మారింది. ఏపీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది అని’ జేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

టీడీపీ తో కూడిన NDA కూటమి సంక్షేమం తో పాటు, అభివృద్ధి కూడా చేయగలదని, తనకు బలమైన విశ్వాసం ఉండబట్టే, టీడీపీ కూటమికి మద్దత్తు ఇస్తున్నానని అన్నారు. అభివృద్ధి అంశంలో, చంద్రబాబు గత చరిత్ర, కృషి దీనికి నిదర్శనం అని JP అన్నారు. 2014 – 2019 కాలంలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రశంసించారు.

.

 

 

 

1 thought on “ఆంధ్ర ప్రదేశ్ లో, జేపీ మద్దత్తు ఎవరికి?”

Leave a Comment