భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో మొదటి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలిరోజు భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) అదరగొట్టాడు. జైస్వాల్ 256 బంతుల్లో 179 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.
యశస్వి బేస్‌బాల్ స్టైల్‌లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో టామ్ హార్ట్లీ వేసిన బంతిని సిక్సర్ బాదడంతో 151 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. యశస్వికి టెస్టు కెరీర్‌లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం. గత ఏడాది జూలైలో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన యశస్వి టెస్టు కెరీర్‌లో 171 పరుగులతో తొలి సెంచరీ నమోదు చేశాడు