ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు మంగళవారంనాడు, సీనియర్ నటి, రాజకీయనాయకురాలు, జయప్రద ను అరెస్టు చేయాలంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. జయప్రదను అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాలని, ఈనెల 27వ తేదీన కోర్టులో హాజరుపరచాలని అక్కడ ఎస్పీ ని కోర్టు ఆదేశించింది. Code of conduct ఉల్లంఘన కేసులో ఏడోసారి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేసినప్పటికీ సోమవారంనాడు ఆమె కోర్టుకు గైర్హాజరయినట్టు సీనియర్ ప్రాసిక్యూషన్ అధికారి అమర్నాథ్ తివారి తెలిపారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కింద రెండు కేసుల్లో జయప్రద “పరారీ”లో ఉన్నారు.
.గత ఏడాది ఒక పాత కేసులో జయప్రదను దోషిగా నిర్దారిస్తూ, చెన్నై కోర్టు 6 నెలల జైలు, రూ.5,000 జరిమానా విధించింది. చెన్నైలోని సొంత థియేటర్ కార్మికులకు ఈఎస్ఐ సొమ్ము చెల్లించలేదనే కేసు లో ఈ శిక్ష పడింది. . ఈ కేసులో సిబ్బంది బకాయిలు చెల్లిస్తానని, కేసు కొట్టివేయాలని కోర్టును కోరినప్పటికీ ఆమె చేసిన అప్పీల్‌ను తోసిపుచ్చుతూ, చెన్నై కోర్ట్ ఆమెకు, 6 నెలల జైలు, జరిమానా విధించింది.