ఎన్నికలకు 2 నెలల ముందు, ఏపీలో డీఎస్సీ – 2024 నోటిఫికేషన్ విడుదలైంది. 6100 టీచర్ పోస్టుల భర్తీకి బుధవారం మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 12 నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలుకానుండగా… ఏప్రిల్ 7తో ముగియనుంది. మొత్తం ఏడు మేనేజ్మెంట్‌లలో ఉన్న స్కూల్స్‌లోని 6100 టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వీటిలో ఎస్‌ఈటీ – 2280 , స్కూల్ అసిస్టెంట్స్ – 2299, టీజీటీ – 1264, పీజీటీ – 215, ప్రిన్సిపల్స్ – 42 చొప్పున ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకానుండగా.. మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్స్‌లో డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఉంటుందని మంత్రి చెప్పారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల అవుతుందన్నారు. అలాగే ఏప్రిల్ 1న కీ లో అభ్యంతరాలపై స్వీకరణ ఉంటుందని.. ఆ వెంటనే ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ కీ విడుదల చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.